Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 14 Nov 2021 18:19:30 IST

రిమాండ్‌లో ఉన్న మహిళతో జైలులో నగ్నంగా డ్యాన్స్ వేయించిన లేడీ ఇన్‌స్పెక్టర్

twitter-iconwatsapp-iconfb-icon
రిమాండ్‌లో ఉన్న మహిళతో జైలులో నగ్నంగా డ్యాన్స్ వేయించిన లేడీ ఇన్‌స్పెక్టర్

కరాచీ: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో దారుణం జరిగింది. పోలీస్ రిమాండ్‌లో ఓ ఉన్న మహిళపై లేడీ ఇన్‌స్పెక్టర్ షబానా ఇర్షాద్ అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. ఆమె దుస్తులు విప్పించి జైలులోని ఇతరుల ముందు డ్యాన్స్ చేయించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు షబానాను ఉద్యోగం నుంచి తొలగించారు. బాధిత మహిళను జైలు కస్టడీకి తరలించారు. 


రిమాండులో ఉన్న మహిళ దుస్తులు విప్పించి అందరి ముందు డ్యాన్స్ చేయించిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో స్పందించిన ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ సందర్భంగా లేడీ ఇన్‌స్పెక్టర్ షబానా తన విధులను దుర్వినియోగం చేసినట్టు తేలింది. జైలులో రిమాండ్‌లో ఉన్న మహిళపై అమానవీయంగా ప్రవర్తించినట్టు వెల్లడైంది. క్వెట్టాలోని జిన్నా టౌన్‌షిప్‌లో చిన్నారి హత్య కేసుకు సంబంధించి పారీ గుల్‌ అనే మహిళను షబానా అరెస్ట్ చేసింది.


ఆమె పోలీసు రిమాండ్‌లో ఉండగా విచారణ పేరుతో దుస్తులు విప్పించిన ఇన్‌స్పెక్టర్ జైలులోని అందరి ముందు నగ్నంగా డ్యాన్స్ చేయించినట్టు క్వెట్టా ఐజీపీ ముహమ్మద్ అజర్ అక్రమ్ తెలిపారు. మహిళా ఇన్‌స్పెక్టర్ షబానా చెప్పేందుకు ఏమీ లేదని, ఆమెను విధుల నుంచి తప్పించినట్టు చెప్పారు. సాటి మహిళపై ఇలా ప్రవర్తించడం సరికాదని, ఇది సహించరానిదని పేర్కొన్నారు.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.