లండన్‌లో ఉన్న నవాజ్‌షరీఫ్ అరెస్టుకు పాక్ అరెస్ట్ వారంట్

ABN , First Publish Date - 2020-09-19T12:28:04+05:30 IST

యునైటెడ్ కింగ్‌డమ్ లోని లండన్ నగరంలో నివశిస్తున్న పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అరెస్టుకు పాక్ ప్రభుత్వం తాజాగా అరెస్టు వారంట్ జారీ....

లండన్‌లో ఉన్న నవాజ్‌షరీఫ్ అరెస్టుకు పాక్ అరెస్ట్ వారంట్

కరాచీ (పాకిస్థాన్): యునైటెడ్ కింగ్‌డమ్ లోని లండన్ నగరంలో నివశిస్తున్న పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అరెస్టుకు పాక్ ప్రభుత్వం తాజాగా అరెస్టు వారంట్ జారీ చేసింది. తీవ్ర అనారోగ్యానికి గురైన 70 ఏళ్ల నవాజ్ షరీఫ్ వైద్య చికిత్స కోసం నాలుగువారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ కోర్టు గత ఏడాది నవంబరులో అనుమతించింది. అవెన్ ఫీల్డ్ ప్రాపర్టీస్, అల్ అజీజియా స్టీల్ మిల్లు కేసుల్లో నవాజ్ షరీఫ్ కు 2018 డిసెంబరులో కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ రెండు కేసుల్లోనూ కోర్టు నవాజ్ షరీఫ్ కు బెయిలు మంజూరు చేసి వైద్యచికిత్స కోసం లండన్ వెళ్లేందుకు అనుమతించింది. నవాజ్ లండన్ నుంచి తిరిగి పాక్ కు వచ్చేందుకు 8 వారాల సమయం ఇచ్చినా ఆరోగ్య సమస్యల కారణంగా అతను తిరిగి రాలేదని నవాజ్ న్యాయవాది తెలిపారు. 


పాక్ సర్కారు నవాజ్ షరీఫ్ అరెస్టు కోసం పంపిన వారంట్ ను అందుకున్నట్లు లండన్ లోని పాక్ హైకమిషన్ వెల్లడించింది. మాజీ ప్రధాని నవాజ్ ను ఈ నెల 22వతేదీన ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరు పర్చాలని కోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ విదేశాంగ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. నవాజ్ లండన్ వెళ్లే ముందు లాహోర్ లోని కో్ లఖ్పాత్ జైలులో శిక్ష అనుభవిస్తుండేవారు. అనారోగ్యానికి గురవడంతో నవాజ్ కు బెయిలుపై జైలు నుంచి విడుదల చేసి లండన్ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. 

Updated Date - 2020-09-19T12:28:04+05:30 IST