కరోనా పాజిటివ్ రావడంతో.. మిలిటరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాక్ విదేశాంగ మంత్రి

ABN , First Publish Date - 2020-07-05T03:19:52+05:30 IST

కరోనా బారిన పడిన పాకిస్థాన్ విదేశాంగమంత్రి ఎస్ఎమ్ ఖురేషికి రావల్‌పిండిలోని

కరోనా పాజిటివ్ రావడంతో.. మిలిటరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాక్ విదేశాంగ మంత్రి

ఇస్లామాబాద్: కరోనా బారిన పడిన పాకిస్థాన్ విదేశాంగమంత్రి ఎస్ఎమ్ ఖురేషికి రావల్‌పిండిలోని మిలిటరి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలిందని శుక్రవారం ఖురేషి తెలిపారు. పాజిటివ్ అని తెలిసిన వెంటనే తాను ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు ఖురేషి తెలిపారు. అల్లా అనుగ్రహం వల్ల తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని.. వర్చువల్‌గా తన కార్యకలాపాలను నిర్వర్తించనున్నట్టు పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక ప్రకారం.. గడిచిన కొద్ది నెలల్లో పాకిస్థాన్ అధికార పార్టీకి చెందిన అనేక మంది నేతలు కరోనా బారిన పడ్డారు. ఇక పాకిస్థాన్ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,25,283 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 4,619 మంది మృత్యువాతపడ్డారు. ఇక కరోనా నుంచి మొత్తంగా 1,25,094 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో అత్యధిక కరోనా కేసులు సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌ల నుంచే నమోదవుతున్నాయి. సింధ్‌లో 90 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. పంజాబ్‌ ప్రావిన్స్‌లో 80 వేలకు పైగా కరోనా బారిన పడ్డారు.

Updated Date - 2020-07-05T03:19:52+05:30 IST