పాక్‌ మాజీ క్రికెటర్‌ తౌఫిక్‌కు కరోనా

ABN , First Publish Date - 2020-05-25T08:28:06+05:30 IST

పాకిస్థాన్‌ మాజీ ఓపెనర్‌ తౌఫిక్‌ ఉమర్‌కు కరోనా వైరస్‌ సోకింది. కొవిడ్‌-19 బారిన పడిన నాలుగో క్రికెటర్‌ తౌఫిక్‌. ఇప్పటికే మజిద్‌ హక్‌ (స్కాట్లాండ్‌), జాఫర్‌ సర్ఫ్‌రాజ్‌

పాక్‌ మాజీ క్రికెటర్‌ తౌఫిక్‌కు కరోనా

కరాచీ: పాకిస్థాన్‌ మాజీ ఓపెనర్‌ తౌఫిక్‌ ఉమర్‌కు కరోనా వైరస్‌ సోకింది. కొవిడ్‌-19 బారిన పడిన నాలుగో క్రికెటర్‌ తౌఫిక్‌. ఇప్పటికే మజిద్‌ హక్‌ (స్కాట్లాండ్‌), జాఫర్‌ సర్ఫ్‌రాజ్‌ (పాకిస్థాన్‌), సోలో నక్వేని (దక్షిణాఫ్రికా) కరోనా బారినపడ్డారు. ‘గతరాత్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నా’ అని ఉమర్‌ కోరాడు. పాక్‌ తరఫున తౌఫిక్‌ 44 టెస్టులు, 22 వన్డేలు ఆడాడు.

Updated Date - 2020-05-25T08:28:06+05:30 IST