టీమిండియా‌ను స్వదేశంలో చిత్తు చేసే సత్తా.. పాకిస్తాన్‌కు ఉంది: ఆసీస్ స్పిన్నర్

ABN , First Publish Date - 2020-07-05T04:59:03+05:30 IST

టీమిండియాను స్వదేశంలో ఓడించడం పెద్దపెద్ద జట్లకే చాలా కష్టం. అలాంటిది మన దాయాది దేశం పాకిస్తాన్.. టీమిండియాను స్వదేశంలో ఓడించగలదని

టీమిండియా‌ను స్వదేశంలో చిత్తు చేసే సత్తా.. పాకిస్తాన్‌కు ఉంది: ఆసీస్ స్పిన్నర్

కాన్‌బెర్రా: టీమిండియాను స్వదేశంలో ఓడించడం పెద్దపెద్ద జట్లకే చాలా కష్టం. అలాంటిది మన దాయాది దేశం పాకిస్తాన్.. టీమిండియాను స్వదేశంలో ఓడించగలదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాను స్వదేశంలో చిత్తు చేసే సత్తా ఏ దేశానికి ఉందని ప్రశ్నించగా.. అతను పాకిస్తాన్ పేరు చెప్పాడు. ‘పాకిస్తాన్ వద్ద మంచి పేస్ బలం ఉంది. అలాగే అద్భుతమైన స్పిన్నర్లున్నారు. వారి బ్యాటింగ్‌లో మంచి డెప్త్ ఉంటుంది. మరీ ముఖ్యంగా భారత వాతావరణ పరిస్థితులను పాక్ ఆటగాళ్లకు బాగా తెలుసు’ అని హాగ్ పేర్కొన్నాడు. పాక్ తర్వాత ఆ సత్తా ఉన్న జట్టుగా ఆస్ట్రేలియా పేరు చెప్పాడు.

Updated Date - 2020-07-05T04:59:03+05:30 IST