పాక్ ఆలౌట్.. ఇంగ్లాండ్ 55/1

ABN , First Publish Date - 2020-08-08T23:44:57+05:30 IST

ఇంగ్లాండ్-పాకీస్తాన్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లో తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మూడోరోజు ఆట ముగిసే సమయానికి పాకీస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. నాలుగో..

పాక్ ఆలౌట్.. ఇంగ్లాండ్ 55/1

లండన్: ఇంగ్లాండ్-పాకీస్తాన్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లో తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మూడోరోజు ఆట ముగిసే సమయానికి పాకీస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. నాలుగోరోజు ఆట మొదలైన కొద్ది సమయానికే మరో 32 పరుగులు చేసి  మిగతా రెండు వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ లంచ్ సమయానికి 22 ఓవర్లలో 55 పరుగులు చేసింది. జో బర్న్స్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం డామ్ సిబ్లీ(26) , జో రూట్(18) క్రీజ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. షాన్ మసూద్ 156 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 219 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ తరుపున ఓలీ పోప్ చేసిన 62 పరుగులే అత్యధికం. దీంతో పాకీస్తాన్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే పాక్ రెండో ఇన్నింగ్స్‌లో మసూద్ డకౌట్ కాగా ఇతర ఆటగాళ్లు కూడా పేలవ ప్రదర్శన చేశారు.

Updated Date - 2020-08-08T23:44:57+05:30 IST