మోదీ నాయకత్వంతో ప్రేరణ పొందా : స్టీవెన్ హారిస్

ABN , First Publish Date - 2021-08-27T21:39:36+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ లక్షణాలు తనకు ప్రేరణగా

మోదీ నాయకత్వంతో ప్రేరణ పొందా : స్టీవెన్ హారిస్

బెంగళూరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ లక్షణాలు తనకు ప్రేరణగా నిలిచాయని యువ కళాకారుడు స్టీవెన్ హారిస్ చెప్పారు. ఆయన ప్రేరణతోనే తాను ఆయన చిత్రాలను గీశానని, వాటిని ఆయన చూసి, తన లేఖను చదివి, తనను ప్రశంసించడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన, ఎదుగుతున్న కళాకారులతో మోదీ నిరంతరం సంబంధాలు కలిగి ఉంటారని, అదే తనకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఏదో ఒక రంగానికి చెందినవారిని కాకుండా, అన్ని రంగాలవారినీ ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. 


మోదీ వల్ల ప్రేరణ పొంది, తాను రూపొందించిన చిత్రాలను ప్రధాన మంత్రి కార్యాలయానికి నేరుగా పంపించానని తెలిపారు. తనను మెచ్చుకుంటూ మోదీ లేఖ రాస్తారని గట్టి నమ్మకం పెట్టుకున్నానని తెలిపారు. తాను భావించినట్లుగానే మోదీ తనకు లేఖ రాసి, తనను ప్రశంసించడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మోదీ తనను ప్రశంసించడంతో తన కుటుంబ సభ్యులు, కళాశాల మిత్రులు హర్షాతిరేకాలతో తనను అభినందిస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోదీ చాలా మందికి, మరీ ముఖ్యంగా యువతకు, ప్రేరణనిస్తున్నారన్నారు. కనీసం కాస్త సమయం అయినా తీరిక లేకుండా పని చేసే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన లేఖను చదవడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని, ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. 


బెంగళూరు విద్యార్థి స్టీవెన్ హారిస్ (20) పంపించిన తన పెయింటింగ్స్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారని ప్రధాన మంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. మోదీ బొమ్మతో రెండు పెయింటింగ్స్‌ను  స్టీవెన్ పంపించారు. ఈ చిత్రాలను మోదీ గురువారం ప్రశంసించారు.


‘‘విషయాలను లోతుగా గ్రహించే ప్రతిభ మీకు ఉందని మీ పెయింటింగ్స్ సూచిస్తున్నాయి. సూక్ష్మ భావాలను వ్యక్తం చేసిన తీరు హృదయాన్ని హత్తుకుంది’’ అని మోదీ ప్రశంసించారు. 


Updated Date - 2021-08-27T21:39:36+05:30 IST