పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతున్నారా? అయితే ఆ మందులు ఎక్కువగా వాడితే ఏమవుతుందో తెలుసా?

ABN , First Publish Date - 2021-12-07T17:38:07+05:30 IST

తల నొప్పి మొదలు కీళ్ల నొప్పుల వరకూ ఉపశమనం కోసం అందరూ పెయిన్‌ కిల్లర్స్‌

పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతున్నారా? అయితే ఆ మందులు ఎక్కువగా వాడితే ఏమవుతుందో తెలుసా?

ఆంధ్రజ్యోతి(07-12-2021)

తల నొప్పి మొదలు కీళ్ల నొప్పుల వరకూ ఉపశమనం కోసం అందరూ పెయిన్‌ కిల్లర్స్‌ మీదే ఆధారపడుతూ ఉంటారు. అయితే ఈ మందులు ఎంతవరకూ సురక్షితం?


నొప్పి నివారణ మందులు వాడే సందర్భంలో మూడు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవి సురక్షితమైనవై ఉండాలి. తక్కువ ప్రభావం కలిగినవై ఉండాలి. వాటిని తక్కువ కాలం పాటు వాడుకోవాలి. సాధారణ పెయిన్‌ కిల్లర్స్‌ ఎసిటమినోఫిన్‌ లేదా ఇబ్యుప్రోఫెన్‌, డిక్లొఫినాక్‌ మొదలైన నాన్‌ స్టిరాయిడల్‌ యాంటీఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ (ఎన్‌ఎస్‌ఎఐడిఎస్‌) ఉంటాయి.


పనితీరు: ఈ రెండు రకాల మందుల పనితీరు భిన్నంగా ఉంటుంది. నాన్‌ స్టిరాయిడల్‌ యాంటీఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ (ఎన్‌ఎస్‌ఎఐడిఎస్‌) నొప్పినీ, ఇన్‌ఫ్లమేషన్‌నూ కలిగించే హార్మోన్లను పోలిన ప్రోస్టాగ్లాండిన్స్‌ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా నొప్పిని తగ్గిస్తాయి. అసిటమినోఫిన్‌... నొప్పికి సంబంధించిన సంకేతాలను అందుకునే మెదడులోని భాగాల మీద పని చేస్తాయి. 


దుష్ప్రభావాలు: నాన్‌ స్టిరాయిడల్‌ యాంటీఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ (ఎన్‌ఎస్‌ఎఐడిఎస్‌) వీటికి యధేచ్ఛగా వాడితే గుండె సమస్యలు పెరగడంతోపాటు కడుపులో పుండ్లు, రక్తస్రావం లాంటి ఇబ్బందులు వేధిస్తాయి. ఈ మందులతో మూత్రపిండాలు, కాలేయ రుగ్మతలు కూడా పెరుగుతాయి. 


నియంత్రణ: నొప్పిని తగ్గించే మందులను వీలైనంత తక్కువగా వాడుకోవాలి. నొప్పిని తగ్గించుకోవడం మీదే దృష్టి పెట్టకుండా, అందుకు కారణాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయాలి. మందులతో నొప్పి అదుపులోకి రాకుండా క్రమేపీ పెరుగుతూ ఉన్నా, నొప్పితో పాటు జ్వరం, విరోచనాలు లాంటి అదనపు ఆరోగ్య సమస్యలు మొదలైనా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. వైద్యులు సూచించిన పెయిన్‌ కిల్లర్స్‌తో ఎటువంటి అసౌకర్యం కలిగినా, ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఈ మందులను ఖాళీ కడుపుతో వేసుకోకూడదు.

Updated Date - 2021-12-07T17:38:07+05:30 IST