నేడు పైడిమాంబ సిరిమానోత్సవం

ABN , First Publish Date - 2021-10-19T08:22:41+05:30 IST

విజయనగరం పైడితల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం తొలేళ్ల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

నేడు పైడిమాంబ సిరిమానోత్సవం

  • ఘనంగా ముగిసిన తొలేళ్ల ఉత్సవం


(విజయనగరం-ఆంధ్రజ్యోతి) 

విజయనగరం పైడితల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం తొలేళ్ల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం తొలేళ్ల ఉత్సవం రోజున పూసపాటి వంశీయుడు అశోక్‌ గజపతిరాజు కుటుంబ సభ్యులు పైడిమాంబకు పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఘట్టం తోలేళ్ల ఉత్సవం పూర్తి కావడంతో మంగళవారం జరగనున్న సిరిమానోత్సవానికి జిల్లా యంత్రాంగంతో పాటు దేవదాయశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది.  కరోనా నేపథ్యంలో  పరిమిత సంఖ్యలో భక్తుల నడుమ సిరిమానోత్స వం నిర్వహించనున్నారు.  ప్రభుత్వం తరుపున  మంత్రి బొత్స సత్యనారాయణ పైడిమాంబకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.  

Updated Date - 2021-10-19T08:22:41+05:30 IST