Sep 28 2021 @ 19:12PM

పైడి జయరాజ్‌ నేటి తరాలకు స్ఫూర్తి!

బాలీవుడ్‌లో మొదటి తరం హీరోల్లో ఒకరిగా స్టార్‌ ఇమేజ్‌ అందుకుని విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటుడు పైడి జయ రాజ్‌.  తెలంగాణ ప్రాంతం నుంచి మూకీల సమయంలోనే హీరోగా బాలీవుడ్‌లో నిలదొక్కుకున్న నటుడు. మంగళవారం అయన 112వ జన్మదినం సందర్బంగా జయంతి వేడుకను మంగళవారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌  పైడి జయరాజ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణ నుంచి ముంబై చేరుకుని అనేక ఇబ్బందుతు ఎదుర్కొని నటుడిగా ఎదిగి, దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకోవడం తెలుగువారికి గర్వకారణం. అయన జీవితం నేటితరాలకు స్ఫూర్తి. రియల్‌ హీరోగా ఎదిగిన అయన మనందరికీ ఆదర్శం. ఇలాంటి గొప్ప మహనీయుని గురించి తెలుగు పరిశ్రమలో ఎక్కువగా తెలియకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయం. ఛాంబర్‌ ఆవరణలో అయన విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.