అద్భుత అనుభవం.. 12 రోజులకు రూ. 608 కోట్లు ఖర్చు పెట్టా.. ఓ బిలియనీర్ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2021-12-15T02:21:45+05:30 IST

జపాన్‌కు చెందిన అపరకుబేరుడు, ఫ్యాషన్ ముఘల్ యుసాకూ మెజావా కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. యాత్రకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.

అద్భుత అనుభవం..  12 రోజులకు రూ. 608 కోట్లు ఖర్చు పెట్టా.. ఓ బిలియనీర్ సంచలన ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: స్పేస్ ఎక్స్, వర్జిన్ గాలెక్టిక్, బ్లూఆరిజిన్ సంస్థల పుణ్యమా అని అంతరిక్ష పర్యటకంపై ప్రపంచ దృష్టి పడింది. ఈ యాత్రలు బాగా ఖరీదైన వ్యవహారం కావడంతో బిలియనీర్లు మాత్రమే ప్రస్తుతం స్పేస్ టూర్లు వేస్తున్నారు. జపాన్‌కు చెందిన అపరకుబేరుడు, ఫ్యాషన్ ముఘల్ యుసాకూ మెజావా కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. సోయూస్ క్యాప్సుల్‌ ద్వారా అక్కడకు చేరుకున్నారు. ఇటీవలే ఆయన అంతరిక్ష కేంద్రం నుంచి తొలి లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. యాత్రకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. 


‘‘ అంతరిక్ష కేంద్రంలో పన్నెండు రోజులు గడిపేందుకు 80 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 608 కోట్లు) చెల్లించా. ఈ యాత్రలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అయితే.. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. శారీరక ధారుఢ్యంతో పాటూ యాత్రకు తగిన సమయం కేటాయించగలవారు మాత్రమే స్పేస్‌ టూర్లు చేపట్టగలరు. ఈ అద్భుత అనుభవం పొందేందుకు ఇంత ఖర్చు పెట్టడం సబబే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో ఆయన స్పేస్ ఎక్స్ ద్వారా చంద్రయాత్ర కూడా చేపట్టనున్నారు. కాగా.. ఈ యాత్ర కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. 



Updated Date - 2021-12-15T02:21:45+05:30 IST