ఘనంగా పాగుంట వెంకన్న కల్యాణం

ABN , First Publish Date - 2021-04-13T05:17:28+05:30 IST

మండలంలోని వెంకటాపురం గుట్టపైనున్న పాగుంట లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది.

ఘనంగా పాగుంట వెంకన్న కల్యాణం
ఉత్సవమూర్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న అర్చకులు, భక్తులు

    కేటీదొడ్డి, ఏప్రిల్‌ 12 : మండలంలోని వెంకటాపురం గుట్టపైనున్న పాగుంట లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేసి పట్టువస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలతో ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఈఓ పురేందర్‌, పెద్దలు శేషిరెడ్డి, సర్పంచు ఆంజనేయులు, గోపి తదితరులు పాల్గొన్నారు.  


భక్తి శ్రద్ధలతో అమావాస్య పూజలు

    మల్దకల్‌, ఏప్రిల్‌ 12 : మల్దకల్‌ మండల కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం అమావాస్య పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు తమ వాహనాలకు పూజలు చేయించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదానం నిర్వహించారు. జ్యోషి మధుసూదనాచార్యులు, రమేశాచార్యులు, రవిఆచార్యులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. మండలంలోని సద్దలోనిపల్లెలో ఉన్న కృష్ణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దాసంగాలు సమర్పించి భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. మండలంలోని అమరవాయి, పాలవాయి గ్రామాల మధ్య అడవిలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదానం చేశారు. 

Updated Date - 2021-04-13T05:17:28+05:30 IST