భక్తిశ్రద్ధలతో పోలి పాడ్యమి

ABN , First Publish Date - 2021-12-06T05:53:26+05:30 IST

కార్తీకమాసం ముగిసిన సం దర్భంగా ఆదివారం పోలి పాడ్యమిని నియోజకవర్గంలోని నాలుగు మండ లాల ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

భక్తిశ్రద్ధలతో పోలి పాడ్యమి
నక్కపల్లి మండలం ఉపమాక పుష్కరిణిలో దీపాలు వదులుతున్న భక్తులు

పాయకరావుపేట/ఎస్‌.రాయవరం/నక్కపల్లి/కోటవురట్ల, డిసెంబరు 5 :  కార్తీకమాసం ముగిసిన సం దర్భంగా ఆదివారం పోలి పాడ్యమిని నియోజకవర్గంలోని నాలుగు మండ లాల ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేకువ జాము నుంచి శివాలయాలు భక్తులో కిటకిటలాడాయి. వేకువ జామున చెరు వులు, నదులు, బావుల వద్ద స్నానా లను ఆచరించిన అనంతరం అరటి డొప్పల్లో దీపాలను అమర్చి కార్తీక దామోదరుడు, విష్ణుమూర్తిలను మన సారా ఆరాధించి నీటిలో విడిచి పెట్టారు. ఆ తరువాత శివాయా లకు వెళ్లి పూజల అనంతరం సాలి గ్రామ, దీపదానాలతో పాటు అర్చకు లకు స్వయంపాకాన్ని అందజేశారు. పాయక రావుపేటలోని పాండురంగ ఆలయంతో పాటు ఎల్‌టీ కాలనీ, బృం దావనం, రాజుగారిబీడు శివాలయాలు,  నామవరం, సత్యవరం, పెంటకోట, సీతమ్మవారి కొండ శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి. అలాగే, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, కోటవురట్ల మండలాల్లో నెల రోజులపాటు కార్తీక మాసం పూజలు చేసిన భక్తులంతా  పోలిపాడ్యమిని  నిర్వహించారు. ఎస్‌.రాయవరం, పెద ఉప్పలం, పెదగుమ్ములూరు, ఉపమాక, గొడిచెర్ల తదితర శివాలయాలు తెల్లవారుజాము నుంచి భక్తులతో కోలాహలంగా మారాయి. 

Updated Date - 2021-12-06T05:53:26+05:30 IST