విద్యార్థి దశ నుంచే భాష పట్ల అభిలాష: పద్మశ్రీ ప్రకాశరావు

ABN , First Publish Date - 2021-01-26T17:56:11+05:30 IST

జాతీయ భావాలను ప్రజల్లోకి చొచ్చుకువెళ్లేందుకు ఏవి అవసరమవుతాయో వాటిని తన జీవితంలో మలుపు తిప్పుకున్నానని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సాహితీవేత్త అసవాడి ప్రకాశరావు అన్నారు.

విద్యార్థి దశ నుంచే భాష పట్ల అభిలాష: పద్మశ్రీ ప్రకాశరావు

అనంతపురం: జాతీయ భావాలను ప్రజల్లోకి చొచ్చుకువెళ్లేందుకు ఏవి అవసరమవుతాయో వాటిని తన జీవితంలో మలుపు తిప్పుకున్నానని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సాహితీవేత్త అసవాడి ప్రకాశరావు అన్నారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వం గుర్తించి తనకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థి దశ నుంచే భాష పట్ల అభిలాష ఉండేదని,  సాహిత్య రంగానికి అంకితమయ్యానని చెప్పారు. 50 సంవత్సరాలుగా సాహిత్య రంగంలో ఉంటూ 60 పుస్తకాలు, లెక్కలేనన్ని వ్యాసాలు రచించినట్లు ప్రకాశరావు తెలిపారు. 

Updated Date - 2021-01-26T17:56:11+05:30 IST