పడిపోయిన ఇటుకల ధర - ఆందోళనలో వ్యాపారులు

ABN , First Publish Date - 2021-04-22T03:58:54+05:30 IST

ఇటుకల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని చిట్టేడు, చంద్రశేఖరపురం, గూడలి, వెంకన్నపాళెం, కోట, రంగన్నగుంట, తిమ్మానాయుడుపాళెం, వంజివాక తదితర గ్రామాల్లో రైతులు ప్రతి ఏడాది ఇటుకలను కాల్చి విక్రయిస్తుంటారు.

పడిపోయిన ఇటుకల ధర - ఆందోళనలో వ్యాపారులు

కోట, ఏప్రిల్‌ 21 :  ఇటుకల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని చిట్టేడు, చంద్రశేఖరపురం, గూడలి, వెంకన్నపాళెం, కోట, రంగన్నగుంట, తిమ్మానాయుడుపాళెం, వంజివాక తదితర గ్రామాల్లో రైతులు ప్రతి ఏడాది ఇటుకలను కాల్చి విక్రయిస్తుంటారు. ఇక్కడ తయారుచేసిన ఇటుకలకు బయటి ప్రాంతాలలో మంచి డిమాండ్‌ ఉంది. గతంలో ఒక ఇటుక 4 రూపాయల నుంచి 4.50 రూపాయల వరకు పలికింది.  ప్రస్తుతం అదే  ఇటుక రూ. 3.50 నుంచి రూ.3.70 మాత్రమే పలుకుతోంది. దీంతో  పెట్టుబడులు కూడా రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కరోనా ఒక పక్క దెబ్బతీయగా, ఇటుకల వ్యాపారంతోనైనా లాభాలు పొందవచ్చనుకున్న వ్యాపారులకు ఛేదు అనుభవం ఎదురైంది.  

Updated Date - 2021-04-22T03:58:54+05:30 IST