పాడేరు-గెమ్మెలి బస్సు సర్వీసు ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-22T06:28:07+05:30 IST

పాడేరు-గెమ్మెలి మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసు నడపడం వల్ల గెమ్మెలి, వంజంగి, గడుతూరు, తాజంగి పంచాయతీల పరిధిలో వున్న సుమారు 80 గ్రామాలకు రవాణా కష్టాలు తొలగుతాయని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.

పాడేరు-గెమ్మెలి బస్సు సర్వీసు ప్రారంభం
పాడేరు-గెమ్మెలి బస్సు సర్వీసును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

పలుగ్రామాలకు తీరనున్న రవాణా కష్టాలు


పాడేరు, జనవరి 21: పాడేరు-గెమ్మెలి మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసు నడపడం వల్ల గెమ్మెలి, వంజంగి, గడుతూరు, తాజంగి పంచాయతీల పరిధిలో వున్న సుమారు 80 గ్రామాలకు రవాణా కష్టాలు తొలగుతాయని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. పీటీడీ అధికారులు నూతనంగా ప్రవేశపెట్టిన పాడేరు-గెమ్మెలి బస్సు సర్వీసును ఆమె శుక్రవారం ఇక్కడ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీటీడీ డిపో మేనేజర్‌ ఆర్‌.ఎస్‌.నాయుడు, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ టి.నరసింగరావు, ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ మత్స్యరాస గాయత్రి, జి.మాడుగుల వైస్‌ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T06:28:07+05:30 IST