భారీ వర్షంతో నేలకొరిగిన వరి

ABN , First Publish Date - 2021-10-24T05:09:18+05:30 IST

మండలంలో శనివా రం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వరి పంట నేలకొరిగిం ది. మండలంలో దాదా పు 500ఎకరాల్లో పంట నష్టమైనట్లు సమాచా రం.

భారీ వర్షంతో నేలకొరిగిన వరి
అద్దాలమర్రి వద్ద నేలకొరిగిన వరిపైరు

500 ఎకరాల్లో పంట నష్టం - ఆందోళనలో రైతన్నలు

చక్రాయపేట, అక్టోబరు 23: మండలంలో శనివా రం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వరి పంట నేలకొరిగిం ది. మండలంలో దాదా పు 500ఎకరాల్లో పంట నష్టమైనట్లు సమాచా రం. ముఖ్యంగా అద్దాల మర్రి వద్ద వందెకరా లకు పైబడి వరి నేలకొ రిగింది. దీంతో రైతులు దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది రైతులు లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. పం ట సాగుచేయడానికి భారీగా ఖర్చు వచ్చినా నోటికాడికి వచ్చిన వరిపంట నీటిపాలైంద ని రైతులు లబోదిబోమంటున్నారు.

మండలంలో అద్దాలమర్రి, కుమార్లకాల్వ, సిద్దారెడ్డి గారిపల్లె, రాజుపల్లె, కుప్పం, తిమ్మారెడ్డిగారిపల్లె, కొండవాండ్లపల్లె, మారెళ్లమడక, చిలే కాంపల్లె ప్రాంతాల్లో వరి పంట భారీగా దెబ్బతినింది. వారం రోజుల్లో పంట కోతకొస్తుం దనే సమయంలో వరిపైరు మోకాటి నీటి లోతులో మునిగిపోయాయని రైతులు అంటున్నారు.

ఏటా ఇదొకతంతుగా మారిందని, కానీ రైతుకు ఎలాంటి సహాయం అంద డం లేదని, వాపోతున్నారు. నోటికాడికొచ్చిన వరిపంట పాడైపోతే ప్రత్యామ్నాయ పంటలు లేవని, ప్రధాన పంట వరే అని అంటు న్నారు. అధికారులు స్పందించి పంట నష్టప రిహారం అందించాలని కోరుతున్నారు. రైతుల పొలాల వద్దకెళ్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు. వర్షానికి వరిపైరంగా పడిపోయిందని, వాటిప క్క చూసి కన్నీరు కారుస్తున్నారు.



Updated Date - 2021-10-24T05:09:18+05:30 IST