లక్ష్యం ఫుల్‌.. సొమ్ములు నిల్‌

ABN , First Publish Date - 2021-06-15T05:15:17+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు లక్ష్యానికి చేరువ య్యాయి. రబీలో 13 లక్షల టన్నులకు గాను ఇప్పటి వరకు 12.70 లక్షల టన్నులు సేకరిం చారు. మరో 30 వేల టన్నులు కొనుగోలు చేస్తే లక్ష్యం పూర్తవు తుంది. ఒకటి, రెండు రోజుల్లో అది నెరవేర్చేం దుకు పౌర సరఫరాల కార్పొరేషన్‌ కసరత్తు చేస్తోంది.

లక్ష్యం ఫుల్‌.. సొమ్ములు నిల్‌

ధాన్యం కొనుగోళ్లలో ముందు.. చెల్లింపుల్లో వెనుక 

13 లక్షల టన్నులకు.. 

12.70 లక్షల టన్నుల సేకరణ

ఇవ్వాల్సింది రూ.2,220 కోట్లు.. 

ఇచ్చింది రూ.737 కోట్లు  

 బకాయిలు రూ.1,473 కోట్లు.. గగ్గోలు పెడుతున్న రైతులు

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు లక్ష్యానికి చేరువ య్యాయి. రబీలో 13 లక్షల టన్నులకు గాను  ఇప్పటి వరకు 12.70 లక్షల టన్నులు సేకరిం చారు. మరో 30 వేల టన్నులు కొనుగోలు చేస్తే లక్ష్యం పూర్తవు తుంది. ఒకటి, రెండు రోజుల్లో అది నెరవేర్చేం దుకు పౌర సరఫరాల కార్పొరేషన్‌ కసరత్తు చేస్తోంది. అదనంగా మరో లక్ష టన్నులు ఇస్తే రబీలో రైతుల వద్ద పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టవు తుంది. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమ తులు రావాలి. ధాన్యం సేకరణలో జాప్యం జరిగినప్పటికీ లక్ష్యానికి సమీపించారు. కానీ రైతులకు సొమ్ముల చెల్లింపులోనే కార్పొరేషన్‌ విఫలమైంది. మొత్తం రూ.2,220 కోట్లకు గాను రూ.737 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.1,473 కోట్లు రావాల్సి ఉంది. గతంలో బిల్లు పంపిన 15 రోజులకు సొమ్ములు చెల్లించాలన్న గడువును తాజాగా మూడు వారాలకు పెంచా రు. నిజానికి రైతుల నుంచి మిల్లులకు ఏనాడో ధాన్యం చేరింది. మిల్లర్లకు లక్ష్యం ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. దీని వల్ల అధికారికంగా ధాన్యం కొనుగోలు చేసినట్టు నమోదు    చేయడంలో ఆలస్యం తొంగి చూస్తోంది. పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతు న్నా రు. రబీ పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చేందుకు ఆపసోపాలు పడుతున్నారు. బకాయిలకు వడ్డీలు పెరిగిపోతున్నా యి. ఖరీఫ్‌ సాగు చేయాలంటే మళ్లీ పెట్టుబడులకు అప్పులు చేయాలి. ఽప్రభుత్వానికి ధాన్యం అమ్మిన వారిలో 70 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. వరి సాగు పెట్టుబడుల కోసం వీరంతా గ్రామాల్లోని దళారులపైనే ఆధారపడ తారు. పురుగు మందుల నుంచి, ఎరువుల వరకు వారే సరఫరా చేస్తారు. ట్రాక్ట ర్‌, ఇతర పెట్టుబడులకు సొమ్ములు ఇస్తారు. ధాన్యం చేతికందిన తర్వాత వడ్డీతో సహా కౌలు రైతుల నుంచి వసూలు చేస్తారు. ప్రభుత్వం నుంచి సొమ్ములు రాకపోవడంతో వడ్డీలు పెరిగిపోతు న్నాయని వీరు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఖరీఫ్‌కు పెట్టుబ డులు అవసరం. ఇప్పటికే బోరుబావుల కింద నారుమళ్లు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే డెల్టాలోనూ మొదలవుతుంది. విత్త నం కొనుగోలు నుంచి రైతుకు పెట్టుబడి అవసరం ఉంటుంది. మరోవైపు బ్యాంకుల్లో చేసిన అప్పులను సకాలంలో చెల్లించాలి. ఇవన్నీ ఇప్పుడు రైతులకు పెద్ద సమస్యగా మారిపోయాయి. 

కేంద్రం నుంచి రావాల్సిందేనా ?

కేంద్రం నుంచి పౌరసరఫరాల కార్పొరేషన్‌కు రూ.3,600 కోట్లు రావాల్సి ఉందని అధికారులు చెపుతున్నారు. జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షల్లో ఇదే విషయా న్ని ఉన్నతాధి కారులు వివరిస్తున్నారు. మరోవైపు పౌరస రఫరాల కార్పొరేషన్‌ అప్పుల్లో కూరుకు పోయిందని విమర్శ లు వస్తున్నాయి. రైతులకు తక్షణమే సొమ్ములు చెల్లించా లంటూ ప్రతిపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా యి. అయినా సరే ప్రభుత్వం నుంచి స్పందన కొరవడింది. వారం రోజుల్లో కనీ సం రూ.300 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికా రులు చెబుతున్నారు. అది జరిగినా సరే కొంత మంది రైతులకు తక్షణ ఉపశమనం కలగనుంది.

  నేడు కాలువలకు నీటి విడుదల

నిడదవోలు, జూన్‌ 14 : పశ్చిమ డెల్టా పరి ధిలోని కాలువలకు తాగు, సాగు నీటి నిమిత్తం మంగళవారం ఉదయం నిడదవోలు మండలం విజ్జేశ్వరం హెడ్‌ స్లూయీజ్‌ నుంచి నీటిని విడు దల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌ ఎం.దక్షిణామూర్తి తెలిపారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విజ్జేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి మాతకు పూజలు నిర్వ హించి బ్యారేజ్‌ గేట్ల స్విచ్‌ ఆన్‌ చేయనున్నా మన్నారు. నీటిపారుదల శాఖ సీఈ పుల్లారావు, ఎస్‌ఈ రవిబాబు, ధవళేశ్వరం ఎస్‌ఈ శ్రీరామ కృష్ణ పాల్గొంటారని తెలిపారు.

Updated Date - 2021-06-15T05:15:17+05:30 IST