దాన్యం సొమ్ములేవీ ?

ABN , First Publish Date - 2022-05-20T06:12:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత కు అన్యాయం చేస్తోంది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడంలో.. సొమ్ముల విడుదలలోనూ జాప్యం చేస్తోం ది.

దాన్యం సొమ్ములేవీ ?
ఽఆచంటలో ఎగుమతికి సిద్ధంగా వుంచిన ధాన్యం ఇలా తడిచింది.

నెల రోజులు గడుస్తున్నా రైతుల ఖాతాల్లో జమ కాని సొమ్ము

ఏలూరు జిల్లాలో రూ.367 కోట్ల విలువైన  లక్షా 89 వేల టన్నులు కొనుగోలు.. 

ఖరీఫ్‌కు పెట్టుబడులు లేక అవస్థలు


ఏలూరు సిటీ, మే 19 : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత కు అన్యాయం చేస్తోంది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడంలో.. సొమ్ముల విడుదలలోనూ జాప్యం చేస్తోం ది. పౌర సరఫరాల కార్పొరేషన్‌ అప్పుల ఊబిలో కూరు కుపోవడంతో కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. గడి చిన పది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేకపోతోంది. రైతు భరోసా కేంద్రాల్లో నమోదు కావడం లేదు. రైతులకు సొమ్ములు అందాలంటే రైతు భరోసా కేంద్రాల్లో నమోదు కావాలి. గడిచిన ఖరీఫ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీకేలను రంగంలోకి దింపినా ధాన్యం అమ్మకానికి రైతులు ఆప సోపాలు పడుతున్నారు. నెలల తరబడి సొమ్ముల కోసం ఎదురు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ప్పటి నుంచి జిల్లాలో ఇదే పరిస్థితి. ఏదో వంకతో జాప్యం చేస్తున్నారు. గతంలో ఈ–క్రాప్‌లో నమోదు కాలేదని రైతులకు సొమ్ములు జమ చేయలేదు. బిల్లుల విషయంలో తీవ్ర జాప్యం జరగడంతో రైతులు గ్రామ స్థాయిలో దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు మద్దతు ధరకంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 267 రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే) ద్వారా ధాన్యం కొంటున్నారు. నిబంధనల ప్రకారం 21 రోజులకు అమ్మిన ధాన్యం సొమ్ములు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి. కానీ నెల రోజులైనా జమ కాలేదని రైతులు చెబుతున్నారు. రెండు రోజుల్లో చెల్లి స్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సార్వా పెట్టుబడులు పెట్టేందుకు ఈ సొమ్ముల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కౌలు రైతులైతే ధాన్యం సొమ్ములు రాకపోవడం తో ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోంది. బ్యాంకు రుణాలు రాక, పండించిన పంటను అమ్మినా సొమ్ములు రాక నానా అవస్థలు పడుతున్నా రు. గతంలో అమ్మిన ధాన్యానికి 48 గంటల్లో సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు. కొంత కాలంగా ఆ గడువును 21 రోజులకు పెంచేశారు. సమయం పెంచి నా ధాన్యం సొమ్ములు రావటంలో జాప్యం జరగటంతో సార్వా పంటకు పెట్టుబడులు పెట్టడం కష్టతరంగా తయారైంది. ఏలూరు జిల్లాలో ఈ ఏడాది 3.66 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణ యించగా ఇప్పటి వరకు 11 వేల 880 మంది రైతుల నుంచి రూ.367 కోట్ల విలువైన లక్షా 89 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. లక్ష్యానికి అనుగు ణంగా 50 శాతం కొనుగోళ్లు జరిగాయి. 


ముందస్తు సాగేనా..?

మరోవైపు జూన్‌ ఒకటో తేదీ నుంచే కాల్వలకు నీటి ని విడుదల చేయనున్నారు. ముందస్తు ఖరీఫ్‌కు వ్యవ సాయ శాఖ ప్రణాళిక రచించింది. ఖరీఫ్‌ సాగాలంటే రైతులకు పెట్టుబడి అవసరం. ప్రభుత్వం సొమ్ములు చెల్లిస్తేనే రైతుకు పెట్టుబడి. మూడేళ్లుగా సొమ్ములు చెల్లింపులో ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. 

సకాలంలో అందించాలి

సకాలంలో సొమ్ములు అందించాలని రైతులు కోరు తున్నారు. సార్వా సాగు ఆరంభమైందని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతోపాటు ఇతర అవసరాల కోసం పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని ధాన్యం సొ మ్ములు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కో వాల్సి వస్తోందని భీమడోలుకు చెందిన ఓ రైతు వాపో యారు. సకాలంలో సొమ్ములు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2022-05-20T06:12:35+05:30 IST