అన్నదాతపై ప్రకృతి ప్రకోపం

ABN , First Publish Date - 2021-11-28T05:24:01+05:30 IST

ప్రకృతి పగబట్టింది.. అన్నదాతను తేరుకోనీ యకుండా చేస్తోంది.

అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
ఉండిలో నేలమట్టమైన వరి పంటను కోస్తున్న కూలీలు

దిక్కుతోచని స్థితిలో రైతాంగం 

మరోసారి వాయుగుండం 

 రైతన్న ఆందోళన


యలమంచిలి, నవంబరు 27 : ప్రకృతి పగబట్టింది.. అన్నదాతను తేరుకోనీ యకుండా చేస్తోంది. గత పది రోజుల వరకూ పంటను చూసి ఆనందపడిన రైతన్న.. ప్రస్తుత పంటను కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. మరో వాయు గుండం ఉందనే సమాచారంతో ఆందోళన చెందుతున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాల్లో వరి చేలు ముంపునకు గురయ్యాయి. ఈనిక దశ దాటిన సమయంలో వర్షాలు కురవడంతో రైతులకు అపార నష్టం సంభ వించింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.వర్షాలకు తోడు ఈదు రుగాలులు వీయడంతో చేతికొచ్చిన పంట నేలనంటింది. చించినాడ, యల మంచిలి, మేడపాడు, నేరేడుమిల్లి, శిరగాలపల్లి, దొడ్డిపట్ల, మట్ల పాలెం తదితర గ్రామాల్లో అధికంగా నష్ట పోయాయని రైతులు వాపోతున్నారు. ఎకరానికి సుమారుగా రూ.25వేలకు పైగా పెట్టుబడి పెట్టి కోతకు వచ్చిన సమయంలో వర్షం నట్టేట ముంచిందని రైతులు వాపోతున్నారు. 


మరోసారి వాయుగుండం.. రైతులకు గండం


వీరవాసరం/ఉండి, నవంబరు 27 : వాతావరణం మార్పులు రైతులను కుదే లు చేస్తున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాలకు మరోసారి వానగండం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో దీని ప్రభావం సార్వాపై మరింత ఉంటుందని రైతులు అంటున్నారు. వానగండం రైతుకు దినదిన గండంగా మారింది. దీపావళి ముసురు నుంచి నేటి వరకూ వరుస తుఫాన్‌లు పంటపై తీవ్ర ప్రభావం చూపించాయి.ఈ నష్టం నుంచి కోలుకోక ముందే మరో తుఫాన్‌ రానుండడంతో ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఆకాశంవైపు చూస్తున్నారు.ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి రాకముందే వాతావరణం రైతులను కుంగదీస్తుందని ఆవేదన చెందుతున్నారు.ఏదో ఒక రకంగా సార్వా పంటను కోతమిషన్లతో, మరొక ప్రక్క కూలీలతో ఒబ్బిడి చేస్తున్నారు. కార్తీకమాసంలో తుఫాన్లుతో కురుస్తున్న వర్షాలతో ప్రజలు, మహిళలు ఇవేమి రోజులు బాబోయ్‌ అంటూ ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. కాలమాన పరిస్దితులు మారిపోతున్నాయంటూ ఏమి చేసేది లేదంటూ అనుకుంటున్నారు.వాతావరణం మార్పుల కారణంగా శనివారం ఉదయం నుంచి మబ్బుగా వుండడంతో రైతులు పరుగుల మీద సార్వా పనులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.


గూడు పోయింది.. గోడు మిగిలింది.. 


పాలకొల్లు రూరల్‌, నవంబరు 27 : మండలంలోని గవరపేటకు చెందిన సరగడం వెంకట రమణ, రామలక్ష్మి దం పతుల ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేలకొరిగింది. ఇల్లు కూలి పో వడంతో వెంకట రమణ దంపతులు నిరాశ్రయులయ్యారు.ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. 


Updated Date - 2021-11-28T05:24:01+05:30 IST