గాలీ వాన బీభత్సానికి వరి నేలమట్టం

ABN , First Publish Date - 2021-10-26T04:48:59+05:30 IST

మండలంలో ఆదివారం రాత్రి వీచిన గాలీవానకు వరి పంట నేలమట్టమైంది.

గాలీ వాన బీభత్సానికి వరి నేలమట్టం
మాధవరాయుని పల్లెలో నేలమట్టమైన వరి పంటను చూపుతున్న రైతు సుబ్బారెడ్డి

బి.కోడూరు, అక్టోబరు 25:  మండలంలో ఆదివారం రాత్రి వీచిన గాలీవానకు వరి పంట నేలమట్టమైంది. రైతు లు ఎకరాకు రూ.20వే ల నుంచి 30వేలు ఖర్చు పెట్టి అదునులో వరి నాటారు. వరి ఏపుగా పెరిగి పొట్ట ఎన్ను దశలో ఉండగా ఆదివారం రాత్రి ఉన్నట్లుండి గాలీవాన రావడంతో దాదాపు 200 ఎకరాల్లో వరి పైరు నేలమట్టమైంది. నోటికాడికి వచ్చిన పంట నేలపాలైందని రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారి సురే్‌షకుమార్‌రెడ్డిని అడుగగా అన్ని గ్రామ పంచాయతీలలో సర్వే నిర్వహించాం. నష్టం అంచనా వేసి ప్రాథమిక నివేదిక తయారు చేసి అధికారులకు పంపుతామని తెలిపారు.

 

 

Updated Date - 2021-10-26T04:48:59+05:30 IST