వరి సాగుకే సై

ABN , First Publish Date - 2021-12-18T06:22:56+05:30 IST

ప్రభుత్వం యాసంగిలో వరి సాగు వద్దని తేల్చి చెప్పి నా మూసీ ఆయకట్టు రైతులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆయకట్టులో దొడ్డు, సన్న రకాల వరిని ముమ్మరంగా సాగు చేస్తున్నారు.

వరి సాగుకే సై
గోల్‌తండాలో వరినాట్లు వేస్తున్న మహిళలు

 ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపని రైతులు 

 నేటి నుంచి మూసీ ఆయకట్టుకు సాగు నీరు

 ప్రభుత్వం యాసంగిలో వరి సాగు వద్దని తేల్చి చెప్పి నా మూసీ ఆయకట్టు రైతులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆయకట్టులో దొడ్డు, సన్న రకాల వరిని ముమ్మరంగా సాగు చేస్తున్నారు. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పప్పు దినుసులు, కూరగాయలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. 

- సూర్యాపేట రూరల్‌

సూర్యాపేట మండలంలో వానాకాలం సీజన్‌లో 32వేల ఎకరా ల్లో వరిసాగు కాగా, యాసంగిలో సైతం అంతే మొత్తంలో వరిసాగ య్యే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనావేస్తున్నారు. మూసీ కింద 12వేల ఎకరాలు, ఎస్‌ఎల్‌బీసీ కాల్వ కింద 10వేల ఎకరాలు, బోరు బావుల కింద మరో 6వేల ఎకరాల్లో వరి సాగుకానున్నట్టు అంచనా. ఇక ఆరుతడి పంటలైన వేరుశనగ, మినుములు, పప్పు దినుసుల 50ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. మొత్తంగా 500 ఎకరాలకు మించి ఆరుతడి పంటలు సాగయ్యే అవకాశం ఉండదని వ్య వసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మూసీ ఆయకట్టు, ఎస్‌ఎల్‌బీసీ కాల్వల పరిధిలో ఆరుతడి పంటలు సాగు చేస్తే జాలు పడుతాయనే భయంతో రైతులు వరి సాగుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అదే విధంగా మండలంలో కోతుల బెడద అధికంగా ఉండటంతో ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గుచూపలేదు. కొనుగోలు కేంద్రాలు ఉండవని ప్రభుత్వం చెప్పడంతో, ఒకవేళ సా గుచేస్తే ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులుంటాయని, అదేవిధంగా భూ యజమానికి డబ్బు ఇవ్వాల్సి వస్తుందని కౌలు రైతులు మా త్రం వరి సాగుకు దూరంగా ఉంటున్నారు.మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు ఈ నెల 18 నుంచి సాగునీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీటిని విడుదల చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వరి సాగు వద్దంటున్న నేపథ్యంలో ఆయకట్టులోని 30వేల ఎకరాల్లో మొదటి జోన్‌కు చెందిన కేవలం 1687ఎకరాల్లో వరి,మిగిలిన 28313ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీటి వినియోగానికి అనుమతించనున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రాజెక్టు కుడి,ఎడమ కాల్వలకు సాగు నీటిని విడుదల చేస్తున్న అధికారులు ఏపంటలకు ఎన్ని రోజులు నీటిని విడుదల చేస్తారనే షె డ్యూల్‌ను మాత్రం ప్రకటించలేదు. ఈవిషయమై ప్రాజెక్టు డీఈ చం ద్రశేఖర్‌ను సంప్రదిస్తే శాఖాపరంగా షెడ్యూలు ఖరారుకాలేదని తె లిపారు. కాగా, 645 అడుగులు (4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం ఉన్న మూసీప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 644.70 అడుగులు (4.38టీఎంసీలు) వద్ద నిలకడగా ఉంది. 151 క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టు 11వ నెంబర్‌ క్రస్ట్‌గేటును అర అడుగు మేర ఎత్తి 1089 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


మండలంలో జోరుగా వరినాట్లు 

అనంతగిరి: మండలంలో జోరుగా వరినాట్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం వరి వద్దని గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. రైతులు ఆరుతడి పంటలకు బదులు వరి సాగుచేస్తున్నారు. మండలంలో 2250 ఎకరాల్లో వరి, 10 ఎకరాల్లో వేరుశనగ, 170 ఎకరాల్లో చెరుకు, 60 ఎకరాల్లో కూరగాయలు సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే 2010 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. 

Updated Date - 2021-12-18T06:22:56+05:30 IST