ధాన్యం సొమ్ములేవీ..?

ABN , First Publish Date - 2021-01-13T06:13:12+05:30 IST

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి వారం రోజుల్లోనే సొమ్మంతా ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామం టూ సర్కారు హామీ ఇచ్చింది. కానీ అనుకు న్నంత సులువుగా మాట నిలబెట్టుకోలేక పోయుంది.

ధాన్యం సొమ్ములేవీ..?

రైతులకు చెల్లించాల్సిన బకాయి రూ.900 కోట్లు

రైతుల్లో అసహనం, ఆగ్రహం.. పెరుగుతున్న వడ్డీలతో సతమతం

పండుగ వేళ.. అన్నదాతల్లో కనిపించని సంక్రాంతి

సంక్రాంతి పండుగ.. ఈ పేరు వినబడగానే అందరికీ గుర్తుకు వచ్చేది అన్నదాతలే. పాడి, పంటలకు నిలువుటద్దం ఈ పండుగ. ధాన్యం సిరులతో కళకళలాడే పండుగగా అందరూ భావించే సంక్రాంతి వేళ రైతుల కళ్ళల్లో వెలుగులేదు. రైతులు పండించిన పంటనైతే సర్కారు కొనుగోలు చేసింది కాని.. రైతుకు ఇవ్వాల్సిన సొమ్మును పెండింగ్‌లో పెట్టేసింది. ఇలా చెల్లించాల్సిన 

మొత్తం రూపాయో రెండో కాదు ఏకంగా రూ.900 కోట్లు...

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

 రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి వారం రోజుల్లోనే సొమ్మంతా ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామం టూ సర్కారు హామీ ఇచ్చింది. కానీ అనుకు న్నంత సులువుగా మాట నిలబెట్టుకోలేక పోయుంది. అదిగో ఇదిగో అంటూనే రైతు కు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు ఒక దశలో వంద కోట్లు దాటితే వారంలో ఇదంతా క్లియర్‌ చేస్తామని అధికారులు రైతులను ఒప్పించారు. ధాన్యం సేకరణకు ముందుకు సాగేలా మెప్పించారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. ఏకంగా 90 వేల మం ది రైతులు జిల్లావ్యాప్తంగా వరి పంట వేశారు. ఆ వచ్చిన ధాన్యాన్ని సర్కారు కొనుగోలు చేయతల పెట్టిన 365 కొనుగోలు కేంద్రాలకు చేర్చారు. ఈ కేంద్రాలు ఆరంభమై రెండు నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దఫా లక్ష్యం దాదాపు 12 లక్షల మెట్రిక్‌ టన్నులు. కానీ ప్రకృతి వికటించి భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో లక్షల ఎకరాల్లో వరి పంట ధ్వంసం అయింది. నీట మునిగింది. వచ్చే దిగుబడి రైతు చేజారింది. పెట్టుబడి నష్టం భారీగా జరిగింది. అంతో ఇంతో ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇచ్చి అప్పుడైతే కొంతసాయం అందించామని చెప్పుకొచ్చారు. అయితే సర్కారు ముందుగా హామీ ఇచ్చినట్లుగా రైతులు అమ్మిన ధాన్యానికి సొమ్ము రైతుల ఖాతాల్లోకి చేరలేదు.  అలా ప్రారంభమైన వాయిదా పద్ధతి వారాలు గడిచి నెలలు దాటినా ఇప్పటికీ అదే పరిస్థితి. ఈ లోపే రైతుల నుంచి ఒత్తిడి పెరిగింది. వాస్తవానికి ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా ఉన్న 365 సేకరణ కేంద్రాల నుంచి దాదాపు ఏడు లక్షల 77 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించ గలిగారు. ఇప్పటి వరకు ఈ మొత్తానికి సంబంధించి రైతులకు చెల్లించా ల్సిన సొమ్ము రూ.1474 కోట్లు. అదిగో ఇదిగో అంటూ ఒక వైపు కాలయాపన చేస్తూనే ఇంకోవైపు చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటిదాకా రైతులకు రూ.582 కోట్లు మాత్రమే వారి ఖాతాల్లోకి చేర్చారు. డెల్టాలోని అన్ని మండలాల్లోనూ రైతాంగ సమాఖ్య, రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు నిరసన గళం విప్పా యి. జిల్లావ్యాప్తంగా అనేక మండలాల్లో గడిచిన కొద్ది రోజులుగా ఈ తరహా ఆందోళనలు కొనసాగుతూనే వచ్చాయి. రైతులకు ఇవ్వాల్సిన సొమ్మును ఇప్పిం చాల్సిందిగా ప్రాధేయపడ్డారు.  

పెండింగ్‌ రూ.900 కోట్లు 

దాదాపు 56 వేల మంది రైతులకు ప్రభు త్వం ధాన్యం సేకరణకు సంబంధించి చెల్లించా ల్సిన మొత్తం సరాసరిన రూ.900 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం బకాయి పడడం గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి.  నెలల తరబడి బకాయిలు నిలిచిపోవడంతో ఇప్పుడు రైతుల పరిస్థితి మరింత కష్టాల మయం అయింది. ఇప్పటికే కౌలు రైతులు అనేక మంది అధిక వడ్డీలకు పెట్టుబడి తెచ్చి వ్యవసాయం చేశారు. గత ఏడాది బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడంలో కాస్త వెనకడుగు వేయడంతో రైతులంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించారు. సర్కారు నుంచి ధాన్యం సొమ్ము రాగానే చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు.  కాని సీను మాత్రం ఇప్పుడు రివర్స్‌. దీంతో రైతుల్లో క్రమేపీ అసహనం పెరుగుతున్నది. ఇప్పటికే కొందరు రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పైకి చెప్పుకోలేక సతమతమవుతున్నారు. సర్కారుకు వ్యతిరేకంగా రంగంలోకి దిగితే కక్ష సాధింపు చర్యలు మొదలవుతాయనే భయం అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వామపక్షాలతోపాటు తెలుగుదేశం కూడా అనేకచోట్ల ఆందోళనకు దిగినప్పుడు పాల్గొన్న రైతుల సంఖ్య స్వల్పంగానేఉంది. పరిస్థితి చేయి దాటక మునుపే తమకు చెల్లించా ల్సిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సిందిగా ఇప్పటికీ రైతులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. సర్కారు ఏం చేస్తుందో చూడాలని మరి. 

Updated Date - 2021-01-13T06:13:12+05:30 IST