సమావేశంలో మాట్లాడుతున్న రైస్ మిల్లర్ల సంఘ అధ్యక్షుడు సోమూరి కృష్ణాజీరావు
మచిలీపట్నం టౌన్, నవంబరు 28 : నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకో వాలని, రంగుమారిన ధాన్యాన్ని కూడా మిల్లర్లు కొనుగోలు చేసేం దుకు అనుమతించాలని మచిలీ పట్నం డివిజన్ రైస్‌మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమూరి కృష్ణాజీ అన్నారు. రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో శనివారం జరిగిన సంఘ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 14 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారని, అయితే భారీ వర్షాలు, పెనుగాలుల కారణంగా పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మిల్లర్లు సహకరిస్తారన్నారు. సంఘ కార్యదర్శి సమ్మెట శ్రీహరి, కోశాధికారి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.