Advertisement
Advertisement
Abn logo
Advertisement

జోరుగా.. హుషారుగా మహా పాదయాత్ర

దారిపొడవునా మంగళ హారతులు

బహ్మరథం పట్టిన ప్రజలు

చెన్నైకి చెందిన ప్రముఖుల సంఘీభావం

ఎనఆర్‌ఐలతోపాటు పలువురు విరాళం

రైతు సంతోషమే.. దేశ ఆనందం : సీబీఐ మాజీ జేడీ


బాలాయపల్లి, డిసెంబరు 5: ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి రైతుల మహా పాదయాత్ర 35వరోజు ఆదివారం జోరుగా, హుషారుగా సాగింది.  దారి పొడవునా ఎదురొచ్చిన పల్లె ప్ర జలు రాజధాని రైతులకు ఘనస్వాగతం పలికారు. గూడూ రు నియోజకవర్గం నుంచి వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలంలోని వెంకటరెడ్డిపల్లికి యాత్ర చేరుకుంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, మహిళలు కర్పూర హారతుల తో ఘనస్వాగతం పలికారు.  వెంకటరెడ్డిపల్లి నుంచి నిండలి రోడ్డు, అంబలపూడి, చుట్టిరోడు మీదుగా  బాలాయపల్లికి  చేరుకుని మధ్యాహ్నం భోజనం చేశారు. భోజనానంతరం మధ్యాహ్నం 3గంటలకు యాచవరం, పచ్చారుచేను మీదుగా పాదయాత్ర కొనసాగి వెంగమాంబపురానికి చేరుకుంది.  రాత్రి అక్కడ బసచేశారు. చెన్నైకి చెందిన 70 మంది తెలుగు ప్రముఖులు పాదయాత్ర రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు  రూ. 7లక్షలను విరాళంగా అందచేశారు. గుంటూరు జిల్లాకు చెందిన గుండవల్లి అసోషియేషన, ఆసే్త్రలియా ఎనఆర్‌ఐ ఫ్రెండ్స్‌  రూ.2లక్షలను విరాళంగా అందజేశారు.  అలాగే చిలకలూరి పేట నియోజకవర్గం యండవల్లికి చెందిన తెలుగు యువత రూ.1.50 లక్షలను విరాళంగా ఇచ్చారు.రాపూరుకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బండి వేణుగోపాల్‌రెడ్డి రూ.9లక్షలు విరాళం అందజేశారు. వెంకటగిరి నియోజ కవర్గ బీజేపీ ఇనచార్జి ఎస్‌ఎస్‌ఆర్‌ నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. బాలాయపల్లి నుంచి వెంగమాంబపురం వరకు సాగిన పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మండల టీడీపీ అధ్యక్షుడు దాసరి రాజగోపాల్‌ నాయుడు, నాయకు లు రాయి మస్తాననాయుడు, సీసీ నాయుడు, రాయి సత్యం నాయుడు, కూను శ్రీహరి, చిత్తూరు ఈశ్వరయ్య, తదిత రులు పాల్గొన్నారు.


రైతు సంతోషంగా ఉంటేనే దేశం ఆనందం


 రైతు సంతోషంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుంద ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గొల్లపల్లి నుంచి బాలాయపల్లి వరకు సాగిన యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు రోడ్డున పడ్డారని పేర్కొ న్నారు. రైతులు కన్నీరు కారిస్తే రాషా్ట్రనికి మంచిదికా దన్నారు.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలన్నారు.  


ప్రలోభాలకు గురిచేస్తున్నారు : జేఏసీ


వెంగమాంబపురంలో పాదయాత్ర ముగిశాక అమరావతి జేఏసీ నాయకులు శివారెడ్డి, తిరుపతిరావు, సుధాకర్‌, శైలజలు మీడియాతో మాట్లాడారు. వెంకటగిరి సీఐ చేతిలో దాడికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి వద్దకు కొందరు వెళ్లి, ఎవరు కొట్టారో చెప్పవద్దు... కేసు పెట్టవద్దు అని చెప్పారని తెలిపారు. అంతేకాక రూ.30 వేలు ఇస్తామని ప్రలోభపెడుతున్నారని వారు  పేర్కొన్నారు.  పాదయాత్రకు ఏపీ ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాలలో తెలుగు మూలాలు ఉన్నవారు కూడా మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అంతేకాక ఉద్యమానికి విరాళాలు అందిస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నవారు మాపై విమర్శలు చేయడంతప్ప రాష్ట్రంపై వారికి ప్రేమలేదన్నారు.


పీఆర్‌ కండ్రిగ నుంచి ప్రారంభం


గూడూరు, డిసెంబరు 5:  రైతులు  చేస్తున్న మహా పాద యాత్ర  ఆదివారం ఉదయం 9:30 గంటలకు  పుట్టంరాజు కండ్రిగ నుంచి ప్రారంభమైంది. జేఏసీ నాయకులు పూజలు నిర్వహించి, శంఖారావం పూరించి పాదయాత్రను ప్రారం భించారు. నెర్నూరు, గొల్లపల్లి మీదుగా పాదయాత్ర 4కిలో మీటర్లు సాగి వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వెంకటరె డ్డిపల్లికి చేరుకుంది. స్థానిక రైతులు మాజీ ఎమ్మెల్యేలు పాశిం సునీల్‌కుమార్‌, కురుగొండ్ల రామకృష్ణలను భారీ పూ లమాలతో సత్కరించారు. కాగా యాత్ర సజావుగా సాగేలా పోలీసులు సహకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ గూడూరు మండలంలో పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నామన్నారు. శనివారం పాదయాత్రలో ఇబ్బందులకు గురిచేసిన పోలీస్‌ అధికారిని విధుల నుంచి తొలగించి, పాదయాత్ర సజావుగా సాగేలా సహకరించినందుకు  ఎస్పీకి ధన్యవాదాలు తెలుపు తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నెలబల్లి భాస్కర్‌రెడ్డి, దుద్దా రాఘవరెడ్డి, బిల్లు చెంచురామయ్య, అబ్దుల్‌రహీం, వాటంబేడు శివకుమార్‌, పులిమి శ్రీనివాసులు, మట్టం శ్రావణి, కొండూరు వెంకటేశ్వర్లురాజు, ఇస్రాయిల్‌ కుమార్‌, కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


బాలాయపల్లెలో యాత్రకు పూలు జల్లు స్వాగతం


స్థానికులు బహూకరించిన గొర్రెపిల్ల, గొంగళితో పాదయాత్ర రైతులు


Advertisement
Advertisement