Abn logo
Sep 27 2021 @ 00:56AM

పడకేసిన పర్యాటకం

లంబసింగిలో అసంపూర్తిగా రిసార్టులు

జిల్లాలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టని వైసీపీ సర్కార్‌

గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన 

ప్రాజెక్టుల పనులు నిలిపివేత

దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్న లంబసింగి రిసార్ట్స్‌

అరకులోయలో అందుబాటులోకి రాని డ్రైవ్‌ఇన్‌ రెస్టారెంట్‌ 

అసంపూర్తిగా ట్రైబల్‌ హట్‌, ఈట్‌ స్ట్రీట్‌ నిర్మాణ పనులు

ప్రతిపాదనల దశలోనే ‘నైట్‌ సఫారీ’

జలపాతాల వద్ద పర్యాటకులకు కొరవడిన సదుపాయాలు

ఏటా రూ.10 కోట్ల ఆదాయం వచ్చే రుషికొండ రిస్టార్ట్స్‌ కూల్చివేత

వెంటాడుతున్న నిధుల కొరత 8 ప్రైవేటు పెట్టుబడులపైనే ఆశలు

నేడు ప్రపంచ పర్యాటక దినం


పర్యాటకం అంటే ఆహ్లాదం, ఆనందమే కాదు... ఉపాధికి అత్యధిక అవకాశాలు కలిగిన రంగం. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో జిల్లాలో ఒక్క పర్యాటక ప్రాజెక్టుని కూడా కొత్తగా చేపట్టలేదు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను సైతం ఎక్కడికక్కడ నిలుపుదల చేసింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పర్యాటక శాఖ మంత్రిగా వున్నప్పటికీ వీటి గురించి పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలో పర్యాటక రంగం పరిస్థితిపై ప్రత్యేక కఽథనం.


విశాఖపట్నం/ అరకులోయ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

ఇంతకు ముందు పర్యాటక దినోత్సవం అంటే ముందుగానే ఇతర రాష్ట్రాల్లో రోడ్‌ షోలు నిర్వహించి పర్యాటకులను ఆకర్షించేవారు. వారికి ప్రత్యేక ప్యాకేజీలు, రాయితీలు ఇచ్చి ప్రోత్సహించేవారు. ఇప్పుడు అవి మచ్చుకైనా కనిపించడం లేదు. అన్నింటికీ కరోనా అడ్డంకిగా మారింది. పర్యాటక రంగాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ప్రతి నెలా ఏదో ఒక ఈవెంట్‌ నిర్వహించి ఉనికిని చాటేవారు. ఇప్పుడు ఏడాదికి ఒకసారి నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్‌, భీమిలి ఉత్సవ్‌లకే నిధులు ఇవ్వడం లేదు. గత ఏడాది పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. అంత దయనీయ స్థితిలో పర్యాటక శాఖ ఉంది. 


అన్నీ పాతవే.. కొత్తవి ఏమీ లేవు

జిల్లాలో పర్యాటకులు సందర్శించదగిన ప్రాంతాలను గుర్తించి, వాటికి రవాణా, మౌలిక వసతులు కల్పిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతోపాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. అయితే ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. ఏళ్ల క్రితం చేపట్టిన పనులే ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారు. నిధుల సమస్య వెంటాడుతోంది. లంబసింగిలో కాటేజీలు పూర్తి కాలేదు. అరకులో ఈట్‌ స్ర్టీట్‌ మధ్యలో ఆగిపోయింది. డ్రైవ్‌ఇన్‌ రెస్టారెంట్‌ ప్రారంభం