Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్యాకెట్ పాలను వేడి చేయకుండా తాగుతున్నారా..?

ఆంధ్రజ్యోతి(23-07-2021)

ప్రశ్న: ప్యాకెట్లలో వచ్చే పాశ్చరైజ్డ్‌ పాలను వేడి చేయకుండా తాగడం వల్ల ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా?


- షేక్‌ జహీరుద్దీన్‌, కడప


డాక్టర్ సమాధానం: కొలై, సాల్మొనెల్లా, లిస్టీరియా మొదలైన హానికారక సూక్ష్మజీవులను చంపివేయడానికి పాలను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, కొద్ద్ది సేపు వేడి చేసి వెంటనే చల్లార్చి ప్యాక్‌ చేస్తారు. దీనిని పాశ్చరైజ్డ్‌ పాలు అంటారు. ఇలా పాశ్చరైజ్‌ చేసిన పాలను ప్యాక్‌ చేసిన సమయం నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్‌ వద్ద రెఫ్రిజిరేటర్‌లో నిల్వచేస్తే కనీసం రెండు రోజుల పాటు సురక్షితంగా ఉంటాయి. సరైన ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచి, పాశ్చరైజ్‌ చేసిన పాలను మొదటి నలభై ఎనిమిది గంటల్లో కాచకుండా వాడినా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కానీ, ప్యాకింగ్‌ చేసిన సమయం నుంచి మన ఇంటికి చేరే వరకు సుమారు నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు పడుతుంది. ఆ పాలు అతి చల్లని ఉష్ణోగ్రతలో కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి కాబట్టి ఆ పాలను మళ్లీ కాచి లేదా వేడి చేసి వాడడమే మంచిది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutriful.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...