కొడుక్కి...తండ్రి జరిమానా

ABN , First Publish Date - 2020-08-12T09:22:14+05:30 IST

పాకిస్థాన్‌తో తొలి టెస్టులో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌కు జరిమానా పడింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్రాడ్‌ వికెట్‌ పడగొట్టిన ..

కొడుక్కి...తండ్రి జరిమానా

మాంచెస్టర్‌: పాకిస్థాన్‌తో తొలి టెస్టులో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌కు జరిమానా పడింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్రాడ్‌ వికెట్‌ పడగొట్టిన ఆనందంలో యాసిర్‌ షా గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇది నచ్చని బ్రాడ్‌.. యాసిర్‌ను దూషిస్తూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌.. స్టువర్ట్‌  మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్‌ పాయింట్‌ను చేర్చాడు. అయితే, ఈ శిక్ష విధించిన క్రిస్‌ బ్రాడ్‌ స్వయానా స్టువర్ట్‌ తండ్రే కావడం విశేషం. ఇదివరకే స్టువర్ట్‌ ఖాతాలో రెండు డీమెరిట్‌ పాయింట్లు ఉండగా.. తాజాగా మూడోది చేరింది. రెండో టెస్టులో కనుక మరో డీమెరిట్‌ పాయింట్‌ చేరితే.. బ్రాడ్‌పై ఓ టెస్టు నిషేధం పడనుంది. నిబంధనల ప్రకారం రెండేళ్ల వ్యవధిలో ఓ ఆటగాడి ఖాతాలో నాలుగు డీమెరిట్‌ పాయింట్లు ఉంటే.. అతడిపై ఓ టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధం విధిస్తారు.

Updated Date - 2020-08-12T09:22:14+05:30 IST