ఎందుకు తప్పించారో..?

ABN , First Publish Date - 2020-07-11T09:24:52+05:30 IST

వెస్టిండీ్‌సతో జరుగుతున్న తొలి టెస్టుకు తనను జట్టులోకి తీసుకోకపోవడంపై ఇంగ్లండ్‌ పేసర్‌ స్టూవర్ట్‌ బ్రాడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు...

ఎందుకు తప్పించారో..?

సౌతాంప్టన్‌: వెస్టిండీ్‌సతో జరుగుతున్న తొలి టెస్టుకు తనను జట్టులోకి తీసుకోకపోవడంపై ఇంగ్లండ్‌ పేసర్‌ స్టూవర్ట్‌ బ్రాడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫామ్‌లో ఉన్న తనను ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదన్నాడు. తనతో  పాటు ఆండర్సన్‌, ఆర్చర్‌, మార్క్‌ వుడ్‌ కలిపి నలుగురు ఫాస్ట్‌ బౌలర్లు సరిపోయారనీ, అందుకే బ్రాడ్‌ను పక్కన పెట్టినట్టు తొలి టెస్టుకు స్టాండిన్‌ కెప్టెన్‌ అయిన స్టోక్స్‌ ఓ ప్రకటనలో తెలిపాడు. దీనిపై బ్రాడ్‌ స్పందిస్తూ.. ‘మ్యాచ్‌ ప్రారంభానికి ముందురోజు స్టోక్స్‌ నా దగ్గరికి వచ్చి పిచ్‌ పరిస్థితులను బట్టి అదనపు  పేసర్‌ అవసరమవుతుందని చెప్పాడు. తీరా మ్యాచ్‌లోకి వచ్చేసరికి నన్ను తీసుకోకపోవడంతో నిరాశకు లోనయ్యా. దశాబ్దకాలంగా జట్టులో ఆడుతున్న నేను ఎన్నోసార్లు మ్యాచ్‌లు గెలిపించా. కరోనాకు ముందు జరిగిన యాషెస్‌ సిరీస్‌, దక్షిణాఫ్రికాతో సిరీ్‌సలో అద్భుతంగా బౌలింగ్‌ చేశా. ఇలా, ఫామ్‌లో ఉన్న నన్ను పక్కన బెట్టడం నాకు నిరాశ, ఆవేదన, చిరాకుతో పాటు ఆగ్రహాన్ని తెప్పించింది’ అని 34 ఏళ్ల బ్రాడ్‌ చెప్పుకొచ్చాడు. బ్రాడ్‌ స్వదేశంలో టెస్టు సిరీ్‌సకు దూరమవడం ఎనిమిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 

Updated Date - 2020-07-11T09:24:52+05:30 IST