టాప్-20లో పేసర్ రేణుకా సింగ్
ABN , First Publish Date - 2022-08-10T05:53:43+05:30 IST
ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో విశేషంగా రాణించిన భారత మహిళల క్రికెట్ జట్టు పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ తన కెరీర్‌లో ఉత్తమ ర్యాంకును సాధించింది.
దుబాయ్: ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో విశేషంగా రాణించిన భారత మహిళల క్రికెట్ జట్టు పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ తన కెరీర్‌లో ఉత్తమ ర్యాంకును సాధించింది. తాజాగా వెల్లడించిన ఐసీసీ టీ20 ప్లేయర్స్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రేణుక టాప్-20లో ప్రవేశించింది. మొత్తం 11 వికెట్లతో టాప్‌లో నిలిచిన రేణుక పది స్థానాలు ఎగబాకి 18వ ర్యాంకుకు చేరింది. సోఫీ ఎకెల్‌స్టోన్ టాప్‌లో ఉండగా భారత్ నుంచి దీప్తి శర్మ ఐదు నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన రెండు స్థానాలు తగ్గి నాలుగో స్థానంలో ఉండగా.. రోడ్రిగ్స్ (10) తిరిగి టాప్-10లో చోటు దక్కించుకుంది. షఫాలీ వర్మ ఆరో స్థానంలో ఉంది.