పీఏబీఆర్‌ కాలువపై పాలకుల నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-08-10T08:06:56+05:30 IST

జిల్లాలో సాగు, తాగు నీరందించే ఏకైక ప్రధాన ఆధారం పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కాలువ

పీఏబీఆర్‌ కాలువపై పాలకుల నిర్లక్ష్యం

ఆధునికీకరణ పనులు చేపట్టడంలో జాప్యం

హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణానికి మంజూరు కాని నిధులు 

కూలిపోయిన వంతెన షట్టర్లు


ఉరవకొండ, ఆగస్టు9:  జిల్లాలో సాగు, తాగు నీరందించే ఏకైక ప్రధాన ఆధారం పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కాలువ. పాలకులు నిర్లక్ష్యం వహించిన ఫలితంగా ఇలాంటి కాలువ ప్రస్తుతం అధ్వాన స్థితికి చేరింది. దాని హెడ్‌రెగ్యులేటర్‌ షట్టర్లు కూలిపోయాయి. కాలువ గట్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.


 హెచ్చెల్సీకి అనుబంధంగా మోపిడి వద్ద మూడు దశాబ్దాల క్రితం పె న్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కాలువను నిర్మించారు. హెచ్చెల్సీ 189 వ కిలోమీటర్‌ నుంచి పీఏబీఆర్‌ వరకు 11 కిలోమీటర్లు పొడవున ఈ కాలువ ఉంది. 1300 క్యూసెక్కుల నీటి ప్రవాహం దీని సామర్థ్యం.


గత ఏడాది రాకెట్ల గ్రామ సమీపంలోని 6.45 కి.మీ వద్ద యూటీ(అండర్‌ టన్నల్‌)కు భారీగా గండి పడి నీరంతా వృథాగా పా రింది. దీంతో కాలువ గట్ల భద్రత దెబ్బతింది. ఇరువైపులా లైనింగ్‌ పె చ్చులూడిపోయి రాళ్లు కనబడుతన్నాయి. పలుచోట్ల కాలువకు పైపింగ్‌ లు ఏర్పడ్డాయి. అలాగే కాలువలో పిచ్చిమొక్కలు పెరిగి నీటి ప్రవాహం కష్టంగా మారింది.


కాలువ పరిధిలో నాలుగు యూటీలు, వంతెన, ఎస్కేప్‌ చానల్స్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. అయినా అధికారులు, పాలకులు పట్టించుకున్న పాపాన పో లేదు. గత ఏడాది సెప్టెంబరులో భారీగా కురిసిన వర్షాలకు హెడ్‌ రెగ్యులేటర్‌ పాక్షికంగా దెబ్బతినగా లింక్‌ చానల్‌పైన రాకపోకలు ఆగి పోయాయి. కెనాల్‌కు నీటి ప్రవాహం అధికం కావడంతో షట్టర్లు మొత్తం ధ్వంసమైపోయాయి. 2008లో చేపట్టిన హెచ్చెల్సీ ఆధునికీకరణలో భాగంగా హెడ్‌రెగ్యులేటర్‌  పునర్నిర్మించాల్సి ఉంది. అయితే పదేళ్లుగా దాని గురించి పట్టించుకోలేదు.


హెడ్‌రెగ్యులేటరు ని ర్మాణానికి రూ3.3కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. గతేడాది సెప్టెంబర్‌లో రెగ్యులేటర్‌ ముందు భాగంలో తాత్కలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. మూడు రోజుల క్రితం కాలువకు నీళ్లు వదిలే సమయంలోనైనా అధికారులు ముందు జాగ్రత్త తీసుకోకపోవడంతో షట్టర్లు, వంతెన కూలిపోయాయి. కాలువకు కాంక్రీట్‌ కట్టడాలు అడ్డంగా పడి నీరు పారేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతేగాకుండా  వంతెన కూలి పోవడంతో  ఈ మార్గంలో రాకపోకలు కూడా నిలిచిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 


ఆధునీకరణ పనులు ప్రతిపాదనలకే పరిమితం:

పీఏబీఆర్‌ ఆధునికీకరణ పనులు రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. రూ. 72 కోట్లతో ప్రతిపాదనలు పంపినా, ఇప్పటికీ నిధులు మంజూ రు కాలేదు. ఈ కాలువ ద్వారా పీఏబీఆర్‌ డ్యాంలో నీరు నిలువ చేసి కుడి కా లువ ద్వారా చెరువులకు, శ్రీరామరెడ్డి ప్రాజెక్ట్‌ ద్వారా హిందూపురం, మడకశిర, కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు, ఉరవకొండ, అనంతపురానికి తాగునీటిని అందిస్తున్నారు.  ఇంతటి ప్రాధాన్యమున్న కాలువను నిర్లక్ష్యంగా వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై రాజకీయ నాయకులు శ్రద్ధ చూపి ఆధునీకరణ పనులు చేపట్టాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. 


హెడ్‌రెగ్యులేటరు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం.. గంగాధర్‌రెడ్డి,  హెచ్చెల్సీ డీఈ

పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ హెడ్‌రెగ్యులేటరు నిర్మాణానికి రూ3.3కోట్లతో ప్రతిపాదనలు పంపాం. కాలువలో అడ్డంగా పడిన కాంక్రీట్‌ కట్టడాలు తొలగించి నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర ్యలు తీసుకుంటాం. పీఏబీఆర్‌కు 400 కూసెక్కులు దాకా నీటిని విడుదల చేస్తున్నాం.

Updated Date - 2020-08-10T08:06:56+05:30 IST