పీఏబీఆర్‌ గేట్ల నుంచి నీరు లీకేజీ

ABN , First Publish Date - 2021-11-28T05:29:28+05:30 IST

పీఏబీఆర్‌లో నీటి ఒత్తిడి పెరగడంతో గేట్ల నుంచి నీరు బయటకు వస్తోంది. డ్యాంలో ప్రస్తుం 5.272 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

పీఏబీఆర్‌ గేట్ల నుంచి నీరు లీకేజీ

డ్యాంలో పెరుగుతున్న నీటిమట్టం..

అప్రమత్తమైన అధికారులు

కూడేరు, నవంబరు 27: పీఏబీఆర్‌లో నీటి ఒత్తిడి పెరగడంతో గేట్ల నుంచి నీరు బయటకు వస్తోంది. డ్యాంలో ప్రస్తుం 5.272 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇటీవల ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఇతర ప్రాజెక్టుల నుంచి నీరు అధికంగా వస్తోంది. జీడిపల్లి, తుంగభద్ర డ్యాం నుంచి దాదాపు 650 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి చేరుతుంది. దీనికితోడు పేరూరు డ్యాం నీరు కూడా వస్తోంది. దీంతో డ్యాంలో నీటి ఒత్తిడి మరింత పెరగడంతో రెవెన్యూ, ఇరిగేషన అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాలు అధికంగా కురిసి, ఇతర ప్రాజెక్టుల నుంచి నీరు అధికంగా వస్తే డ్యాంలో నీటి మట్టం పెరిగే ప్రమాదం ఉండటంతో ఇటీవల తహసీల్దార్‌ శ్రీనివాసులుతోపాటు సిబ్బంది డ్యాం పరిసర గ్రామాల్లో పర్యటించి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం డ్యాంలో నీటి ఒత్తిడి అధికంగా ఉండటంతో గేట్ల వెంబడి నీరు బయటకు వస్తోంది. ఓ పక్క విద్యుదుత్పత్తి, మరోపక్క కుడి కాలువకు నీరు వదిలి డ్యాంలో నీటి ఒత్తిడిని తగ్గించడానికి అ ధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డ్యాం గేట్లు ఎత్తారన్న ప్రచారం జరగడంతో శనివారం సం దర్శకులు భారీ స్థాయిలో తరలివచ్చారు.


Updated Date - 2021-11-28T05:29:28+05:30 IST