Jul 28 2021 @ 10:00AM

పా.రంజిత్ సినిమా అంటే నమ్మలేదు: దుషారా విజయన్‌

పా.రంజిత్ సినిమా అంటే నమ్మలేదు అన్నారు హీరోయిన్ దుషారా విజయన్‌. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'కబాలి', 'కాలా' సినిమాలను తీసి కోలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్‌గా మారిన పా.రంజిత్ తాజాగా 'సార్పట్ట' మూవీని రూపొందించాడు. ఆర్య హీరోగా నటించిన ఈ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలైన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా హీరోయిన్ దుషారా విజయన్‌ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. "దిండుగల్‌ జిల్లా కన్యాపురం గ్రామానికి చెందిన నేను ప్యాషన్‌ డిజైనింగ్‌ చేసే సమయంలో 'బోదై ఏరి బుద్ధిమారి' అనే మూవీలో ఓ చిన్న పాత్ర పోషించాను.

ఆ తర్వాత పా.రంజిత్‌ దర్శకత్వంలో 'సార్పట్ట' మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఓ రోజు రంజిత్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. తర్వాతరోజు ఆఫీసుకు రమ్మని చెప్పారు. అయితే, అది ఫేక్ కాల్ అని నేను నమ్మలేదు. రెండో రోజు మళ్లీ పోన్‌ చేసి.. పా.రంజిత్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేస్తే రాలేదేంటని అని ప్రశ్నించారు. దీంతో వెంటనే ఆఫీస్‌కి వెళ్లాను. అడిషన్‌లో సెలెక్ట్‌ కావడంతో నటించే అవకాశం లభించింది" అని చెప్పుకొచ్చారు దుషారా విజయన్‌.