AP News: ఏసీబీ‌కి చిక్కిన పి.గన్నవరం ఎంపీడీవో

ABN , First Publish Date - 2022-09-12T23:32:53+05:30 IST

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: పి.గన్నవరం ఎంపీడీవో (MPDO) కేఆర్ విజయ ఏసీబీ (ACB)కి చిక్కారు. రాజులపాలెం గ్రామ ఉపసర్పంచ్ నంబూరు విజయలక్ష్మి నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల మంజూరు కోసం ఎంపీ

AP News: ఏసీబీ‌కి చిక్కిన పి.గన్నవరం ఎంపీడీవో

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: పి.గన్నవరం ఎంపీడీవో (MPDO) కేఆర్ విజయ ఏసీబీ (ACB)కి చిక్కారు. రాజులపాలెం గ్రామ ఉపసర్పంచ్ నంబూరు విజయలక్ష్మి నుంచి  రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల మంజూరు కోసం  ఎంపీడీవో రూ.  50 వేలు లంచం డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ. 10 వేలు ఇచ్చి ఏసీబీ ని ఆశ్రయించారు విజయలక్ష్మి. రెండో విడతగా రూ. 40 వేలు లంచం (Bribe) తీసుకుంటుండగా ఎంపీడీవోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

Updated Date - 2022-09-12T23:32:53+05:30 IST