సెప్టెంబరు తర్వాత... IPO ప్లాన్ లో OYO

ABN , First Publish Date - 2022-05-24T21:34:15+05:30 IST

హాస్పిటాలిటీ/ట్రావెల్-టెక్ సంస్థ OYO... సెప్టెంబరు తర్వాత... IPO కు రావాలని యోచిస్తోంది.

సెప్టెంబరు తర్వాత... IPO ప్లాన్ లో OYO

న్యూఢిల్లీ : హాస్పిటాలిటీ/ట్రావెల్-టెక్ సంస్థ OYO... సెప్టెంబరు తర్వాత... IPO కు రావాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే... సెబీకి లేఖ రాసింది. గతేడాది అక్టోబరులో ప్రారంభ వాటా విక్రయం ద్వారా రూ. 8,430 కోట్లను సమీకరించాలని సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసిన కంపెనీ... ప్రారంభంలో లక్ష్యంగా పెట్టుకున్న $ 11 బిలియన్లకు బదులుగా ఇప్పుడు సుమారు $ 7-8 బిలియన్ల తక్కువ వాల్యుయేషన్‌తో స్థిరపడేందుకు సిద్ధమైంది.


సెప్టెంబరు త్రైమాసికం తర్వాత IPOను ప్రారంభించేందుకు OYO చేస్తోన్న యత్నాలకు కారణం... ప్రధానంగా దాని ఆర్థిక పనితీరులో మెరుగుదలతో పాటు మార్కెట్ ప్రస్తుత అస్థిర స్వభావానికి సంబంధించిన అంచనాలేనని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. OYOను నడుపుతున్న Oravel Stays Ltd... నిరుడు సెప్టెంబరు 30, సెప్టెంబరు 30, 2020లతో ముగిసిన ఆరు నెలల కాలవ్యవధికి సంబంధించి పునఃప్రారంభించబడిన ఆర్థిక నివేదికలను చేర్చడానికి అనుమతిని కోరినట్లు సెబీకి రాసిన  లేఖలో పేర్కొంది.


‘కొత్తగా జాబితా అయిన స్టాక్‌లో ధరల స్వింగ్‌లు ప్రజలలో ఆందోళన రేకెత్తిస్తాయి. అధిక బుకింగ్‌లకు దారితీస్తుదని పెట్టుబడిదారులకు ముందుగా చూపించడం ఉత్తమం. ఈ క్రమంలో...  OYO త్రైమాసికం వరకు వేచి ఉండవచ్చు’... అని కంపెనీ ప్లాన్‌ల గురించి తెలిసిన వర్గాల నుంచి వినవస్తోంది. ఈ విషయమై స్పందించేందుకు OYO నిరాకరించింది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(DRHP) ప్రకారం... OYO FY21 లో రూ. 1,744.7 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కంపెనీ ప్రతిపాదిత IPO, దాని DRHP ప్రకారం రూ. 7 వేల కోట్ల వరకు ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ సహా రూ. 1,430 కోట్లకు అమ్మకానికి ఆఫర్‌ను కలిగి ఉంది. కాగా... OYO ఇప్పుడు రూ. 1,430 కోట్ల ఆఫర్ ఫర్ సేల్(OFS) కాంపోనెంట్‌ను తొలగించి, రూ. 7 వేల కోట్ల ప్రైమరీ ఇష్యూతో మాత్రమే ముందుకు సాగాలని కోరుకుంటోందని, అంతేకాకుండా... ఆమోదం కోసం SEBI కి నివేదించిందని సమాచారం.


కాగా... OYO మార్కెట్‌లలో లిస్టింగ్‌కు వెళ్లినప్పుడు, గత కొన్ని నెలల్లో స్టాక్ మార్కెట్లు ఎలా మారాయన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటే... అది ప్రారంభంలో లక్ష్యంగా చేసుకున్న $ 11 బిలియన్ల కంటే తక్కువ $7-8 బిలియన్ల విలువతో స్థిరపడుతుందని వినవస్తోంది. అక్టోబనే 2021 లో కంపెనీ తన DRHPను సెబీకి దాఖలు చేసినప్పుడు, మార్కెట్లు ఉత్తేజంగా ఉండడంతోపాటు IPO లు స్టాక్ మార్కెట్‌లోకి ప్రవహించే మూలధనంతో అధిక వాల్యుయేషన్‌లు, ఓవర్‌సబ్‌స్క్రిప్షన్‌లను పొందుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ... భౌగోళిక అనిశ్చితి,  రాజకీయ అశాంతి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు తదితర పరిణామాల నేపథ్యంలో పరిస్థితులు మారినట్లు వినవస్తోంది. 

Updated Date - 2022-05-24T21:34:15+05:30 IST