హోటల్ రంగానికి 'ఓయో' ఓ వరం!

ABN , First Publish Date - 2020-09-28T02:38:51+05:30 IST

19 మహమ్మారి కారణంగా ఆతిథ్య రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆతిథ్యం రంగంలో భాగాలైన హోటల్స్‌పై, రవాణా రంగంపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. అత్యున్నత పరిశుభ్రతా ...

హోటల్ రంగానికి 'ఓయో' ఓ వరం!

వైజాగ్‌: 19 మహమ్మారి కారణంగా ఆతిథ్య రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆతిథ్యం రంగంలో భాగాలైన హోటల్స్‌పై, రవాణా రంగంపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. అత్యున్నత పరిశుభ్రతా ప్రమాణాలు, చేతులతో తాకకుండా సేవలు అందించడం, మెరుగైన విశ్వసనీయత వినియోగదారుల అవసరాల జాబితాలో అగ్రస్థానం సంపాదించుకున్నాయి. మారుతున్న ఈ పర్యావరణ వ్యవస్థలో, నూతన ప్రమాణాలతో కూడిన నిర్వహణా ప్రమాణాలను ఆతిథ్య రంగ పరిశ్రమలు తీసుకురావల్సి వచ్చింది. 


ఇలాంటి పరిస్థితుల్లో వైజాగ్‌కు చెందిన రవి అలియాజ్‌ లంకపల్లి ఉమా రామలింగేశ్వరరావు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. సొంతగా హోటల్‌ కలిగి ఉన్న రవి.. 2017 నుంచి హోటల్‌ రంగంలో ఉన్న రవి 2018లో ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌లో తన హోటల్‌ను నమోదు చేసుకున్నారు. ఆ తరువాత హోటల్‌కు వినియోగదారుల రాక భారీగా పెరిగింది. అప్పటి నుంచి రవి ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ మద్దతుతో అత్యున్నత నాణ్యత కలిగిన స్టే ఇన్‌ అనుభవాలను వినియోగదారులకు అందిస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో కొన్ని ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటిని కూడా ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సాయంతో రవి అధిగమించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ,  కోవిడ్‌ అనంతరం రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల్లో 100కు పైగా రూమ్‌లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ హోటల్‌కు శానిటైజ్డ్‌ స్టేట్‌ ట్యాగ్‌ ఉందని, మా అతిథుల భద్రత కోసం ఓయోతో కలిసి అవసరమైన అన్ని భద్రతా చర్యలనూ తాము తీసుకుంటున్నామని రవి చెబుతున్నారు. 


ఓయో కో–ఓయో యాప్‌, తమ భాగస్వాములందరికీ తమ పనితీరు, ధరలు, సమీక్షలుపై పూర్తి విజిబిలిటీని అందించడంతో పాటుగా చాట్‌ సపోర్ట్‌, స్వీయ సహాయ విభాగం, సపోర్ట్‌ టిక్కెట్‌ సెంటర్‌తో ఆధునీకరించబడింది. గత ఏడు సంవత్సరాలుగా, ఈ ఆతిథ్య రంగ గొలుసుకట్టు సంస్థ వందలాది సూక్ష్మ వ్యాపారవేత్తలకు భారతదేశంలో అండగా నిలవడంతో పాటుగా ఉపాధి కల్పన చేయడంలో సహాయపడుతోంది. ఓయో వ్యాపార ప్రతిపాదన, సాంకేతికతపై ఆధారపడటమే కాక సేవా సంస్కృతిపై కూడా ఆధారపడింది.

Updated Date - 2020-09-28T02:38:51+05:30 IST