పల్లె ప్రకృతి వనాలతో ప్రాణవాయువు

ABN , First Publish Date - 2020-09-30T06:26:46+05:30 IST

పల్లె ప్రకృతి వనాలతో ప్రజలకు మంచి ప్రాణవాయువు లభిస్తుందని జడ్పీ చైర్‌పర్సన్‌ దపేదర్‌ శోభ అన్నారు. మంగళవారం జిల్లా

పల్లె ప్రకృతి వనాలతో ప్రాణవాయువు

జడ్పీ చైర్‌పర్సన్‌ దపేదర్‌ శోభ 


కామారెడ్డి, సెప్టెంబరు 29: పల్లె ప్రకృతి వనాలతో ప్రజలకు మంచి ప్రాణవాయువు లభిస్తుందని జడ్పీ చైర్‌పర్సన్‌ దపేదర్‌ శోభ అన్నారు. మంగళవారం  జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామీణభివృద్ధి శాఖ స్థాయీ సంఘ సమావేశానికి ఆమె ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పల్లెలో ప్రకృతివనాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిందని అన్నారు. దాంట్లో భాగంగా జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రకృతి వనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పల్లె ప్రకృతివనం చిన్న అడవిని తలపించేలా ఉండాలని అన్ని గ్రామాలు చాలా అందంగా ముస్తాబవుతాయని అన్నారు. రైతులు రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులను వాడాలనే ఉద్దేశంతో ప్రతీ గ్రామంలో కాంపో్‌స్ట షెడ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నామని, దీని ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం లభిస్తుందని అన్నారు. విధిగా వాటర్‌ట్యాంక్‌లను గ్రామాలలో బ్లీచింగ్‌ పౌడర్‌ వేసి శుభ్రపరిచేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలలో పాగింగ్‌ మిషన్‌లు సమకుర్చుకోవాలని సూచించారు. గ్రామంలో వారానికి రెండు సార్లు స్ర్పేచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్‌ దుకాణాల వద్ద ప్రజలు గుమ్మికూడకుండా భౌతికదూరం పాటిస్తూ.. మాస్క్‌లను ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని పౌర సరాఫరా ల శాఖ అధికారులకు సూచించారు. తర్వాత, డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పకృతి వనాల నిర్మాణంతో పాటు డంపింగ్‌యార్డ్స్‌, వైకుంఠధామాలు, కంపోస్ట్‌ షెడ్‌లు నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. 


కాగా, సాయంత్రం జరిగిన విద్యా, వైద్య స్థాయీ సంఘ సమావేశానికి జడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దపేదర్‌ శోభ మాట్లాడుతూ పీహెచ్‌సీలలో ర్యాపిడ్‌ టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని, ఒకవేళ పాజిటివ్‌ వచ్చినచో వారికి మందులు అందజేయాలన్నారు. గ్రామాలలో ఆశకార్యకర్తలు, ఏఎన్‌ఎంల సహకారంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారిని రెగ్యులర్‌గా మానిటరింగ్‌ చేస్తు వారిని చూసుకోవాలని సూచించారు. డిజిటల్‌ తరగతుల నిర్వహణ విద్యార్థులపై మానిటరింగ్‌ నిర్వహణ తీరుపై డీఈవో రాజు ను అడిగి తెలుసుకున్నారు. ఉదయం జరిగిన స్థాయీ సంఘ సమావేశానికి డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, జడ్పీటీసీ నారెడ్డిమోహన్‌రెడ్డి, జడ్పీ సీఈవో చందర్‌నాయక్‌, జిల్లా పంచాయితీ అధికారి నరేష్‌, పౌరసరాఫరా, పరిశ్రమల అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన సమావేశంలో నాగిరెడ్డిపేట జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, గాందారి జడ్పీటీసీ కేతావత్‌ శంకర్‌నాయక్‌, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, డీసీహెచ్‌ఎస్‌ అజయ్‌కుమార్‌, విద్యాశాఖ అధికారి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-30T06:26:46+05:30 IST