ఇంటింటా ప్రాణవాయివు

ABN , First Publish Date - 2021-05-17T05:56:23+05:30 IST

పంచభూతాల్లో ఒకటైన ప్రాణవాయువు అవసరం జనానికి ఇప్పుడు తెలిసొచ్చింది. ప్రాణాన్ని నిలిపే ఆక్సిజన్‌ కోసం కష్టకాలంలో ఉన్న కుటుంబాలు అర్రులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంటింటా ప్రాణవాయివు

  ముందస్తుగా ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుగోలు చేసుకుంటున్న సంపన్నులు
  బంధుమిత్రుల అవసరాలకు సరఫరా
 స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే సిలిండర్లకు అనూహ్య డిమాండ్‌

(అమలాపురం-ఆంధ్రజ్యోతి) పంచభూతాల్లో ఒకటైన ప్రాణవాయువు అవసరం జనానికి ఇప్పుడు తెలిసొచ్చింది. ప్రాణాన్ని నిలిపే ఆక్సిజన్‌ కోసం కష్టకాలంలో ఉన్న కుటుంబాలు అర్రులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చాలా మంది తమ ఇళ్లల్లో నిత్యావసరాలతో పాటు ఆక్సిజన్‌ సిలిండర్‌ కూడా కొనుక్కుని ముందస్తుగా పెట్టుకుంటున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రరూపం దాల్చడంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. మరణాలు కూడా అధికంగా ఉంటున్నాయి. గతంతో పోలిస్తే కొవిడ్‌ బాధితులకు ఇప్పుడు ఆక్సిజన్‌ లెవెల్స్‌ గణనీయంగా పడిపోతున్నాయి. వారంతా కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్ల కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు వందల సంఖ్యలో ఆక్సిజన్‌  సిలిండర్లను సేవా దృక్పథంతో కొవిడ్‌ బాధితులకు ఇస్తున్నాయి. దీంతో పాటు చాలా మంది ముందస్తుగానే ఆక్సిజన్‌ సిలిండర్లను రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు వెచ్చించి ఇళ్ల వద్ద పెట్టుకుంటున్నారు. అత్యవసరమైతే వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఇస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు, చిరంజీవి సేవా సమితి, భజరంగ్‌దళ్‌, విశ్వహిందూపరిషత్‌లతో పాటు కోనసీమ ఐ బ్యాంకు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వందల సంఖ్యలో సిలిండర్లలో ఉచితంగా ఆక్సిజన్‌ నింపి అందజేస్తున్నారు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గిన వ్యక్తులు ఇళ్ల దగ్గరే వీటిని వినియోగిస్తున్నారు. దీంతో వాటికి డిమాండు బాగా పెరిగింది. రూ.10వేల నుంచి రూ.20వేలు ఉండే                      సిలిండర్ల ధర ఇప్పుడు రెట్టింపు పలుకుతోంది.

Updated Date - 2021-05-17T05:56:23+05:30 IST