ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా చర్యలు

ABN , First Publish Date - 2021-05-18T05:10:11+05:30 IST

రాష్ట్రంలో మూతపడి ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్లను వినియోగంలోకి తీసుకువచ్చి ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా చర్యలు
ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలించి వస్తున్న మంత్రులు గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ తదితరురు

మంత్రి గౌతమ్‌రెడ్డి

చిల్లకూరు, మే 17: రాష్ట్రంలో మూతపడి ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్లను వినియోగంలోకి తీసుకువచ్చి ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని బూదనం గ్రామంలోని ఆక్సిజన్‌ ప్లాంటును మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌తో కలిసి సందర్శించారు. 45 రోజుల్లో 1000 మెట్రిక్‌టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరతను అఽధిగమించేందుకు కొత్త ఇండస్ట్రీయల్‌ పాలసీని తీసుకువస్తున్నామన్నారు. ఆక్సిజన్‌  ప్లాంట్లు పెట్టుకునేందుకు కొత్త పథకాలు కూడా అందించనున్నామని తెలిపారు. బూదనంలోని ఆక్సిజన్‌ ప్లాంటును అందబాటులోకి తీసుకువచ్చిన అధికారులను అభినందిస్తున్నామన్నారు.  కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ, తహసీల్దారు గీతావాణి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T05:10:11+05:30 IST