కలబుర్గిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌లో తనిఖీలు

ABN , First Publish Date - 2021-05-06T07:59:35+05:30 IST

కర్ణాటకలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఉన్నా మహారాష్ట్ర, తెలంగాణకు ఆక్సిజన్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్న ప్రైవేట్‌ ప్లాంట్‌పై కలబుర్గి అధికారులు తనిఖీలు...

కలబుర్గిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌లో తనిఖీలు

బెంగళూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఉన్నా మహారాష్ట్ర, తెలంగాణకు ఆక్సిజన్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్న ప్రైవేట్‌ ప్లాంట్‌పై కలబుర్గి అధికారులు తనిఖీలు చేశారు. రెండురోజుల క్రితం కలబుర్గి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మురుగేశ్‌ నిరాణి... ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ స్థానికులకు తొలుత ప్రాధాన్యం ఇచ్చి వినియోగించాలని సూచించారు. అయినా కలబుర్గి జిల్లా నందూరు పారిశ్రామికవాడలో విజయ ఆక్సిజన్‌ ఇం డస్ట్రీ ప్లాంట్‌ నుంచి మహారాష్ట్ర, తెలంగాణకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మంగళవారం రాత్రి ప్లాంట్‌పై దాడి చేసి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-05-06T07:59:35+05:30 IST