‘యుద్ధ’ప్రాతిపదికన ఆక్సిజన్‌

ABN , First Publish Date - 2021-05-06T08:24:38+05:30 IST

దేశంలో కరోనా బాధితులకు అవసరమైన మెడికల్‌ ఆక్సిజన్‌, ఇతర పరిరకాలను తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం తొమ్మిది యుద్ధనౌకలను వివిధ దేశాలకు పంపించింది

‘యుద్ధ’ప్రాతిపదికన ఆక్సిజన్‌

సముద్రసేతు-2లో తొమ్మిది యుద్ధనౌకలు


విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా బాధితులకు అవసరమైన మెడికల్‌ ఆక్సిజన్‌, ఇతర పరిరకాలను తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం తొమ్మిది యుద్ధనౌకలను వివిధ దేశాలకు పంపించింది. సముద్రసేతు-2 పేరుతో నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌ కోసం ముంబై, కొచ్చి, విశాఖపట్నం నుంచి నౌకలు బయల్దేరి వెళ్లాయి. తల్వార్‌ నౌక బహ్రెయిన్‌ నుంచి 27 టన్నుల ఆక్సిజన్‌తో బుధవారం న్యూ మంగుళూరు పోర్టుకు చేరుకుంది. కోల్‌కతా నౌక.. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి 27 టన్నుల ఆక్సిజన్‌, 400 ఆక్సిజన్‌ సిలిండర్లు, 47 కాన్సంట్రేటర్లు తీసుకుని భారత్‌కు బయల్దేరింది. సింగపూర్‌ నుంచి ఐరావత్‌ నౌక 216 టన్నుల ఆక్సిజన్‌, 3,600 ఆక్సిజన్‌ సిలిండర్లు, పది వేల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష కిట్లు, ఏడు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లతో వస్తున్నట్టు నేవీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-05-06T08:24:38+05:30 IST