కంటైనర్‌ నుంచి ఆక్సిజన్‌ లీక్‌

ABN , First Publish Date - 2021-05-23T08:57:55+05:30 IST

కంటైనర్‌ నుంచి ఆక్సిజన్‌ లీకవుతుండటంతో రైల్వే అధికారులు మరమ్మతులు చేసి, లీకేజీని అరికట్టారు. టాటా స్టీల్‌ పరిశ్రమ నుంచి చెన్నైకి ఆక్సిజన్‌ కంటైనర్లతో రెండురోజుల కిందట రైలు బయలుదేరింది

కంటైనర్‌ నుంచి ఆక్సిజన్‌ లీక్‌

పలాసలో గుర్తించిన రైల్వే అధికారులు


పలాస, మే 22: కంటైనర్‌ నుంచి ఆక్సిజన్‌ లీకవుతుండటంతో రైల్వే అధికారులు మరమ్మతులు చేసి, లీకేజీని అరికట్టారు. టాటా స్టీల్‌ పరిశ్రమ నుంచి చెన్నైకి ఆక్సిజన్‌ కంటైనర్లతో రెండురోజుల కిందట రైలు బయలుదేరింది. అందులో ఓ కంటైనర్‌ నుంచి ఆక్సిజన్‌ లీకవుతుండటాన్ని శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద సిబ్బంది గుర్తించి, స్టేషన్‌ మేనేజర్‌ పట్నాయక్‌కు తెలియజేశారు. వెంటనే ఆయన రైలును స్టేషన్‌లో నిలిపివేయించి, స్థానిక సిబ్బందిని మరమ్మతుకు ఆదేశించారు. వారివల్ల కాకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు తరలించారు. అక్కడి సిబ్బంది లీకేజీని నియంత్రించారు. దీంతో రైలు తిరిగి చెన్నైకి పయనమైంది. 

Updated Date - 2021-05-23T08:57:55+05:30 IST