రైల్వే లోకోషెడ్ సిబ్బంది సరికొత్త ప్రయోగం

ABN , First Publish Date - 2021-06-01T16:03:11+05:30 IST

విజయవాడ: రైల్వే లోకోషెడ్ ఇంజనీర్లు వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అందుబాటులో ఉన్న వనరులతోనే...

రైల్వే లోకోషెడ్ సిబ్బంది సరికొత్త ప్రయోగం

విజయవాడ: రైల్వే లోకోషెడ్ ఇంజనీర్లు వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అందుబాటులో ఉన్న వనరులతోనే కరోనా బాధితులకు ఆక్సిజన్ ఫ్లో మీటర్లను రూపొందించారు. పరిశ్రమల్లో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లను వైద్య అవసరాలకు తగినట్లుగా  మార్పులు చేశారు. కరోనా సోకినవారిలో ఆక్సిజన్ అందక చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువే ఉంది. ప్రాణవాయువు అందించేందుకు కొన్ని స్వచ్చంధ సంస్థలు, మరికొందరు దాతలు ముందుకొస్తున్నారు. 


ఇప్పుడు విజయవాడ రైల్వే లోకోషెడ్ సిబ్బంది సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తమ వద్ద ఉన్న పరికరాలతోనే ఆక్సిజన్ ప్లో మీటర్లు తయారు చేసి కొన్ని విజయవాడ రైల్వే ఆస్పత్రికి సరఫరా చేశారు. బయట మార్కెట్‌లో రూ. 4వేలు ధర ఉండగా.. వారు రూ. 2వేలకే అందుబాటులోకి తీసుకువచ్చారు. లోకోషెడ్‌లో బలమైన ఇనుపసామాగ్రిని వెల్డిండ్ ద్వారా కట్ చేయడానికి పరిశ్రమల్లో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండ్లను వాడారు. ఒక్కో సిలిండర్‌లో 49 లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది.

Updated Date - 2021-06-01T16:03:11+05:30 IST