ఆక్సిజన్‌ సిలిండర్ల ఏర్పాటు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-05-14T06:11:25+05:30 IST

బనగానపల్లె పట్టణంలోని ప్రభుత్వవైద్యశాలకు సొంత డబ్బుతో ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గురువారం తెలిపారు.

ఆక్సిజన్‌ సిలిండర్ల ఏర్పాటు: ఎమ్మెల్యే

బనగానపల్లె, మే 13: బనగానపల్లె పట్టణంలోని ప్రభుత్వవైద్యశాలకు  సొంత డబ్బుతో ఆక్సిజన్‌ సిలిండర్లు,  ఇతర పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గురువారం తెలిపారు.  కరోనా  వైద్యం అంది స్తున్న పభుత్వవైద్యశాలలోని బెడ్లను ఆయన స్వయంగా పరిశీలించారు. అనం తరం విలేఖర్లతో మాట్లాడుతూ  బనగానపల్లె నియోజకవర్గంలో రోజు రోజుకూ కరోనా  కసులు పెరుగుతుండడంతో సుదూర ప్రాంతమైన నంద్యాల, కర్నూలుకు వెళ్లకుండా బనగానపల్లెలోనే ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. సొంత డబ్బుతో  10 పెద్ద ఆక్సిజన్‌ సిలిండర్లు, 5 చిన్న ఆక్సిజన్‌ సిలిండర్లు,   ఇతర పరికరాలను  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గిన కరోనా బాధితులకు ఆదుకునేందుకు ఈ ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఆస్పత్రిలో రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని హెచ్చరించారు. అలాగే అధునాతన వసతులతో నిర్మిస్తున్న లేబర్‌ ప్రసూతి వార్డును, వందపడకల ఆస్పత్రి నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుజాత సీఐ సురేశ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ కృష్ణమూర్తి, గ్రామ పంచాయితీ ఈవో ఖలీల్‌బాషా, నూకల వెంకటసుబ్బయ్య, సజ్జాద్‌హుస్సేన్‌, పత్తివెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-14T06:11:25+05:30 IST