Abn logo
May 11 2021 @ 00:00AM

ప్లీజ్‌.. ఓ బెడ్‌ ఇవ్వరూ

ఆక్సిజన్‌ పడకలు దొరక్క బాధితులు విలవిల

డిశ్చార్జ్‌ అయితేనే పడకలు.. ఇంట్లో వైద్యంతో ప్రాణాల మీదకు..

సీసీసీలో పడకలున్నా ఆసుపత్రులపైనే జనం మొగ్గు


భీమవరానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా సోకింది. ఆసుపత్రులు ఖాళీ లేక ఇంట్లోనే వైద్యం చేయించుకు న్నారు. బీపీ, షుగర్‌ లెవెల్స్‌ పెరగడంతో చనిపోయారు. పాజిటివ్‌ వచ్చిన ఆయన భార్య రెండు రోజుల తరువాత చనిపోయారు. వాళ్లింటికి దగ్గరలోనే ఉండే ఆయన సోదరి రోజు తేడాలో మృతి చెందింది. ఇప్పుడు అతని కుమారుడికి పాజిటివ్‌ రావడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 


కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన ఒక వ్యక్తికి వారం క్రితం పాజిటివ్‌ వచ్చింది. అతన్ని భీమవరం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. బెడ్లు లేవని చెప్పడంతో టిడ్కో క్వారంటైన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆక్సిజన్‌ సదుపాయం లేదు. కొన్నిరోజుల తర్వాత బాగానే ఉందని చెప్పడంతో ఇంటికి తీసుకువెళితే.. రెండు రోజుల తర్వాత పరిస్థితి విషమించి చనిపోయారు.


కాళ్ల మండలానికి చెందిన ఒక మహిళ రెండు రోజుల క్రితం భీమవరం ప్రభుత్వాసుపత్రికి భర్తను ఆటోలో తీసుకువచ్చింది. తన భర్త పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రిలో చేర్చమని కోరింది. ఇక్కడ బెడ్లు లేవని చెప్పడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితిలో ఉండిపోయింది. చివరకు అంబులెన్స్‌లో టిడ్కో నివాసాల్లో ఉన్న కొవిడ్‌ కేంద్రానికి తరలించారు. 


భీమవరం క్రైం/తణుకు, మే 11 : కరోనా బాధితుల కష్టాలు వర్ణనాతీతం. అప్పటికప్పు డు ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది పడితే ఎక్కడకు వెళ్లాలో తెలియడం లేదు. ఏ ఆసు పత్రికి వెళ్లినా ఆక్సిజన్‌ బెడ్లు ఖాళీ లేవనే సమాధానం వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళదామంటే ముందుగానే లక్షల్లో సొ మ్ములు జమ చేయాలి. పేద, మధ్య తరగతి వారు ప్రభుత్వాసుపత్రి, హోం క్వారంటైన్‌లో ఉండగా, ధనికులు మాత్రం కార్పొరేట్‌ వైద్యా నికి పరుగులు పెడుతున్నారు. జిల్లాలో రోజు కు సుమారు ఆరు వేలకుపైగా పరీక్షలు చేస్తుండగా వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. భీమవరంలో కొవిడ్‌ ఆసుపత్రులుగా ప్రకటించిన నాలుగు ప్రైవేటు ఆసుపత్రుల్లో 120 బెడ్లు ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ బెడ్లు 50 ఉన్నాయి. వీటిల్లో ఎక్కడా ఖాళీ లేవు. ఎవరైనా డిశ్చార్జ్‌ అయితేనే కొత్త పేషెంట్లకు అవకాశం ఇస్తు న్నారు. టిడ్కో భవన సముదాయంలోని కొవి డ్‌ కేర్‌ సెంటర్‌ల్లో వెయ్యి బెడ్లు ఉండగా 240 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ఆక్సిజన్‌ సదుపాయం లేకపోవడంతో ఎవరూ వెళ్లడం లేదు. భీమవరం నుంచి బాధితులు ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.


ఆక్సిజన్‌కు ప్రయత్నాలు :  నోడల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు

భీమవరంలో టిడ్కో నివాసాల్లో వెయ్యి వరకు బెడ్లు ఉన్నప్పటికీ ఆక్సిజన్‌ కొరత వేధిస్తున్నది. ప్రస్తుతం 240 మంది ఉన్నారు. ఆక్సి జన్‌ కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు ప్లాంట్‌ నుంచి 50 శాతం ఆక్సిజన్‌ కోసం కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. కొవ్వూరు ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ సరఫరాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


సిఫార్సుందా.. ఓకే

తణుకుకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ ప్రభుత్వాసుపత్రిలో చేరేం దుకు ప్రయత్నించారు. బెడ్స్‌ లేకపోవడంతో చికిత్స నిమిత్తం కాకినాడ వెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. వేల్పూ రు చెందిన మరొకరు ఆసుపత్రికి వెళ్లి బెడ్‌ కోసం గంటల తరబడి స్ర్టెక్చర్‌పై వేచి ఉ న్నారు. తర్వాత ఎవరో చనిపోతే బెడ్‌ కేటా యించారు. ఇలాంటి పరిస్థితి ప్రభుత్వాసు పత్రిలో నిత్యకృత్యం. పట్టణంలో తొమ్మిది కొవిడ్‌ ఆసుపత్రులున్నాయి. వీటిలో ఐసీ యూ బెడ్స్‌ 54, ఆక్సిజన్‌ బెడ్స్‌ 135, సాధా రణ బెడ్స్‌ 198 వెరసి మొత్తం 387 ఉన్నా యి. అధికారిక లెక్కలు మాత్రం మంగళ వారం సాయంత్రానికి ఐదు ఆక్సిజన్‌ బెడ్స్‌, 136 సాధారణ బెడ్స్‌ ఖాళీగా ఉన్నట్టు చెబు తున్నారు. ఇక ఈ ప్రభుత్వాసుపత్రిలో కొవి డ్‌ బాధితులకు బెడ్‌ దొరకాలంటే నరకమే. ప్రభుత్వ లెక్కలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. కొవిడ్‌ ఆసు పత్రుల్లో చేరాలంటే సిపారుసులు ఉండా ల్సిందే. అలా సిపారసులు చేయించుకున్న వారికి ఏదో ఆసుపత్రిలో మంచం దొరుకుతోంది. ఇక సామాన్యులకు మాత్రం ఆసుపత్రి వర్గాలు చుక్కలు చూపి స్తున్నాయి. చాలా ఆసుపత్రులు బెడ్లు లేవనే సమాధానంతో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. 


Advertisement