ఆక్సిజన కొరత రానీయద్దు!

ABN , First Publish Date - 2021-05-13T05:12:51+05:30 IST

వైద్యశాలల్లో ఆక్సిజన కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి జిల్లా కొవిడ్‌ టాస్క్‌ఫోర్సు అధికారులను ఆదేశించారు.

ఆక్సిజన కొరత రానీయద్దు!
అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి గౌతమ్‌

ఎంత అవసరమో తెప్పిస్తాం

కొవిడ్‌ టాస్క్‌ఫోర్సు అధికారుల సమీక్షలో మంత్రి గౌతమ్‌


నెల్లూరు (హరనాథపురం), మే 12 : వైద్యశాలల్లో ఆక్సిజన కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి జిల్లా కొవిడ్‌ టాస్క్‌ఫోర్సు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని తిక్కన భవనలో కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌, వ్యాక్సినేషన కార్యక్రమంపై బుధవారం కొవిడ్‌ టాస్క్‌ఫోర్సు అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్ని నోటిఫైడ్‌ కొవిడ్‌ వైద్యశాలలు ఉన్నాయి? వాటిలో ఎన్ని ఆక్సిజన, ఐసీయూ బెడ్స్‌ అందుబాటులో ఉన్యాయి? రోగులకు ఆక్సిజన అవసరం ఎంత ఉంది? ప్రస్తుతం జిల్లాకు ఎంత ఆక్సిజన సరఫరా అవుతుందనే వివరాలను మంత్రి అడిగి తెలుసుకొన్నారు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలతో మాట్లాడి ఆక్సిజన కొరతను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకొంటామని చెప్పారు. ఆక్సిజన కొరత రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


పనిభారం తగ్గించండి!


నెల్లూరు జిజీహెచలోని ఐసీయూలో పని భారం ఉన్నందున జూనియర్‌ వైద్యులకు 8 గంటల షిఫ్టు విధానంలో డ్యూటీలు కేటాయించాలని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆదేశించారు. కొన్ని ప్రైవేటు వైద్యశాలు రోగులకు బెడ్స్‌ కేటాయించడంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని కలెక్టర్‌కు తెలిపారు. అలాంటి ఘటనలు జరిగితే తప్పక చర్యలు తీసుకొంటామని కలెక్టర్‌ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి జీజీహెచలో బెడ్‌ల కేటాయింపులు జరిగాయనే విషయాన్ని తెలిపిన మంత్రి ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జీజీహెచ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. 


ఆక్సిజన సరిపోవడం లేదు!


పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా జిల్లాకు అందుతున్న ఆక్సిజన సరిపోవడం లేదని కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. కొవిడ్‌ వైద్యశాలల్లో రోగులకు 36.5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన వినియోగిస్తునటుఉ్ల చెప్పారు. తమిళనాడు నుంచి ఆక్సిజన సమయానికి అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కర్ణాటక, వైజాగ్‌, ఇస్రోల నుంచి ఆక్సిజనను అత్యవసరంగా తీసుకొని వచ్చి రోగులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఆక్సిజన కొరతను భర్తీ చేయడానికి మంత్రులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రులు జిల్లా అవసరమైన ఆక్సిజనను అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ మాట్లాడుతూ కొవిడ్‌ మొదటి వేవ్‌లో ఇద్దరు, రెండోవేవ్‌లో ఏడుగురు పోలీసులు విధినిర్వహణలో మరణించారని తెలిపారు. పోలీసులతోపాటు ఫ్రంట్‌ లైన వర్కర్లుగా పని చేస్తున్న అందరికీ మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సమావేశంలో జేసీలు హరేందిరప్రసాద్‌, ప్రభాకర్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కార్పొరేషన కమిషనర్‌ దినేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-13T05:12:51+05:30 IST