ఏడేళ్ల వయసులోనే పుస్తకం రాసిన అభిజిత

ABN , First Publish Date - 2020-09-21T08:33:41+05:30 IST

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభిజిత ఏడేళ్ల వయసులోనే రచయిత్రిగా మారింది. ఆలోచనలకు అక్షర రూపమిచ్చి.. ఆసక్తికి సాహితీ పరిమళం అద్ది.. చిట్టి చేతులతో పద్యాలు, కథలు రాసి.. ’హ్యాపీనెస్‌ ఆల్‌ ఎరౌండ్‌’శీర్షికన ఓ పుస్తకాన్ని రచించింది...

ఏడేళ్ల వయసులోనే పుస్తకం రాసిన అభిజిత

  • మైథిలీశరణ్‌ గుప్త్‌ ముని మనవరాలి ప్రతిభ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 : ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభిజిత ఏడేళ్ల వయసులోనే రచయిత్రిగా మారింది. ఆలోచనలకు అక్షర రూపమిచ్చి.. ఆసక్తికి సాహితీ పరిమళం అద్ది.. చిట్టి చేతులతో పద్యాలు, కథలు రాసి.. ’హ్యాపీనెస్‌ ఆల్‌ ఎరౌండ్‌’శీర్షికన ఓ పుస్తకాన్ని రచించింది. దాన్ని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ జూనియర్‌, ఇన్‌విన్సిబుల్‌ పబ్లిషర్స్‌ సంయుక్తంగా విడుదల చేశాయి. రచనా వ్యాసంగంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు.. రాష్ట్ర కవి మైథిలీశరణ్‌ గుప్త్‌, సంత్‌కవి సియారామ్‌శరణ్‌ గుప్త్‌ల ముని మనవరాలు. ఐదేళ్ల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టిన అభిజితప్రస్తుతం.. రెండో తరగతి చదువుతోంది. సాహితీపిపాస కుటుంబంలో మూడోతరం రచయిత్రిగా బాల్యం నుంచే బాటలు వేసుకుంటోంది. 


Updated Date - 2020-09-21T08:33:41+05:30 IST