టీటీడీలో సొంతవారికే పెద్దపీట

ABN , First Publish Date - 2020-12-05T09:38:49+05:30 IST

రాష్ట్రంలోని పదవుల భర్తీలో వైసీపీ ప్రభుత్వం సొంతవారికి పెద్ద పీట వేసి సామాజిక న్యాయాన్ని పాతర వేస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

టీటీడీలో సొంతవారికే పెద్దపీట

రాష్ట్రం నుంచి ఇద్దరే బీసీలా?

(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పదవుల భర్తీలో వైసీపీ ప్రభుత్వం సొంతవారికి పెద్ద పీట వేసి సామాజిక న్యాయాన్ని పాతర వేస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో తమ హయాంలో 19 మంది సభ్యులు ఉండేవారని.. ఆ సంఖ్యను ఈ ప్రభుత్వం 32కి పెంచిందని చెప్పారు. కానీ అందులో రాష్ట్రానికి చెందిన బీసీ వర్గాల వారికి కేవలం ఇద్దరికే చోటు కల్పించారని ఆక్షేపించారు. ‘చైర్మన్‌, ఈవో, అదనపు ఈవో ఒకే సామాజిక వర్గం నుంచి ఉండడం చరిత్రలో లేదు. ఇవి చాలదన్నట్లు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌, తిరుపతి ఎమ్మెల్యే పదవి కూడా అదే వర్గం వారికి ఇచ్చారు. మా హయాంలో సామాజిక సమతుల్యత పాటిస్తే వైసీపీ ప్రభుత్వం సామాజిక ద్రోహం చేస్తోంది. పైగా బెదిరింపులకు పాల్పడుతోంది’ అని విమర్శించారు.

Updated Date - 2020-12-05T09:38:49+05:30 IST