Abn logo
Apr 9 2020 @ 19:11PM

నిబంధనలు ఉల్లంఘించిన స్వీట్‌షాప్‌ ఓనర్‌పై కేసు నమోదు

న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్‌లో ఉన్న బెంగాలీ పేస్ట్రీ షాప్ యజమానిపై ఎన్‌ఎండీసీ, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత దూరం పాటించాలనే నిబంధనను ఉల్లంఘిస్తూ.. 35 మంది సిబ్బందితో పని చేయిస్తున్నట్లు గమనిస్తున్న పోలీసులు యజమానిపై కేసు నమెదు చేశారు.


కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగిపోవడంతో.. బుధవారం బెంగాలీ మార్కెట్‌తో పాటు పలు ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించి.. అక్కడ ఉన్న షాపులను సీజ్ చేశారు.


కానీ.. ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్న పోలీసులకు దాదాపు 35 మంది సిబ్బంది అపరిశుభ్రంగా ఉన్న షాపు పైఅంతస్తులో నివాసం ఉంటూ కనిపించారు. దీంతో జిల్లా మెజిస్ట్రేట్ తన్వీ గ్రాగ్ ఆదేశాల మేరకు ఆ సిబ్బంది దగ్గర్లో మరో నివాసానికి తరలించారు. యజమానిపై ఐపీసీలో తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement