సొంతింటి గూడు గోడు

ABN , First Publish Date - 2021-04-13T06:37:10+05:30 IST

పేదింటి గూడు చెదిరింది. ప్రభుత్వం మురిపించి నట్టేట ముంచింది. సొంతింటి కల సాకారం చేస్తామని ఉత్తచేతులు చూపింది.

సొంతింటి గూడు గోడు
మొండి గోడలకే పరిమితమైన ఇంటి నిర్మాణం

ఐదేళ్లుగా అందని గృహ నిర్మాణ బిల్లులు

అసంపూర్తి నిర్మాణాలతో వెక్కిరిస్తున్న మొండిగోడలు

మురిపించి నట్టేట ముంచిన ప్రభుత్వం

పేదల సొంతింటి కలకు మోకాలడ్డిన వైనం


రాయదుర్గం రూరల్‌, ఏప్రిల్‌ 12 : పేదింటి గూడు చెదిరింది. ప్రభుత్వం మురిపించి నట్టేట ముంచింది. సొంతింటి కల సాకారం చేస్తామని ఉత్తచేతులు చూపింది. ఏళ్లు గడుస్తున్నా పునాదులు కూడా పైకి లేవని దయనీయంలో పేదల పక్కా గృహాలు చతికిలపడ్డాయి. మండలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సొంతిల్లు నిర్మించి ఇచ్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం పెద్దఎత్తున శ్రీకారం చుట్టిం ది. రూ.1.70 లక్షలు వెచ్చించి పక్కా ఇల్లు నిర్మాణం చేపట్టి ఇవ్వాలని సంకల్పించింది. అదే క్రమంలో 2016-2020 మధ్య కాలంలో మండ లానికి దాదాపు 1400 పక్కాఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అ యితే ఆ నాలుగేళ్లలో 960 ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన 441 ఇళ్లు వి విధ దశల నిర్మాణంలో అసంపూర్తిగా నిలిచాయి. 


బిల్లుల కోసం ఎదురుచూపులే మిగిలాయి..

మండలంలోని పలు గ్రామాల లబ్దిదారులకు ప్రభుత్వం గృహాలు మంజూరు చేయడంతో మొదట్లో ఆనందం వ్యక్తం చేశారు. అప్పోసొ ప్పో చేసి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం చేయడంతో డీలా పడ్డారు. 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లకు చెల్లించాల్సిన బిల్లులన్నీ ఉన్నఫలంగా నిలిపే శారు. దీంతో లబ్ధిదారుల కలలపై పిడుగుపడినట్లయ్యింది.  చేసేదేమీ లేక అప్పులు చేసి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నారు. మరికొంతమంది ఇంటి నిర్మించుకునే స్థోమత లేక అర్ధంతరంగా వదిలేశా రు. నిర్మాణాలన్నీ మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయి. అప్పులు చేసి ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు నేటికీ బిల్లులు మంజూరు కాకపోవడంతో బయటి వ్యక్తులతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమ తమవుతున్నారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 50 శాతం మంది లబ్ధిదారులకు ఒకటి, రెండు బిల్లులు వచ్చాయి. మిగిలిన బిల్లుల కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నా ఒక బిల్లే వచ్చిం దని.. మిగిలిన బిల్లుల కోసం హౌసింగ్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గృహ నిర్మాణ బి ల్లులను మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 


అప్పు చేసి ఇల్లు కట్టా

పూజారి మల్లమ్మ, ఎస్సీ కాలనీ, ఉడేగోళం 

గత ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. ఇంటి నిర్మాణం పూర్తయింది. నేటికీ ప్రభుత్వం ఒ క్క బిల్లు మాత్రమే మంజూరు చేసింది. మిగిలిన బిల్లుల కోసం ఇప్పటివరకు హౌసింగ్‌ అధికారుల ను అడుగుతున్నా సరైన సమాధానం లేదు. అప్పులు చేసి ఇల్లు కట్టా. బయటి వ్యక్తులకు వడ్డీలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నా. ప్ర భుత్వం స్పందించి వెంటనే పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయాలి. 


బిల్లుల కోసం ఎదురుచూస్తున్నా..

నల్లజరవమ్మ, బీసీ కాలనీ, 74 ఉడేగోళం 

గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి నిర్మా ణ పనులు కొంతవరకు పూర్తి చేశా. ప్రభుత్వం రెండు బిల్లులు మాత్రమే మంజూరు చేసింది. మి గిలిన రెండు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీం తో అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణానికి ఇబ్బందులు పడుతున్నా. ఆర్థిక స్థోమత లేకపోవడంతో అర్ధంతరంగా నిలిచిపోయిన ఇంట్లోనే కాపురం వుంటున్నాం. అధికారులు స్పందించి బిల్లులు మంజూరు చేస్తే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటా. 


Updated Date - 2021-04-13T06:37:10+05:30 IST